Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభJr NTR Speech: ‘వార్ 2’తో మళ్లీ అభిమానుల్ని రెండు కాలర్స్ ఎత్తుకునేలా చేస్తాను: ఎన్టీఆర్‌

Jr NTR Speech: ‘వార్ 2’తో మళ్లీ అభిమానుల్ని రెండు కాలర్స్ ఎత్తుకునేలా చేస్తాను: ఎన్టీఆర్‌

WAR 2 Pre Release Event: ఇండియన్ ఐకానిక్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో YRF (యశ్ రాజ్ ఫిల్మ్స్) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మాతగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘వార్ 2’. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మూవీని తెలుగులోకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ఆదివారం (ఆగస్ట్ 10) నాడు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ‘‘ బాద్ షా ఫంక్షన్‌లో వరంగల్‌కు చెందిన అభిమాని చనిపోయారు. అప్పటి నుంచి ఇలా పబ్లిక్ ఫంక్షన్‌లకు కాస్త దూరంగా ఉంటూ వచ్చాను. నా 25 ఏళ్ల సినీ జర్నీని సెలెబ్రేట్ చేయాలని నన్ను ఫోర్స్ చేసిన వంశీకి, వంశీని ఫోర్స్ చేసిన అభిమానులకు థాంక్స్. ‘వార్ 2’ చేయడానికి ప్రధానం కారణం ఆదిత్య చోప్రా. ‘వార్ 2’ చేయాల్సిందే అని నన్ను వెంటపడిన ఆదిత్య చోప్రాకి థాంక్స్. అభిమానులు గర్వపడేలా చేస్తాను ఆదిత్య చోప్రా గారు నాకు భరోసానిచ్చారు. నన్ను ఇందులో భాగం చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ టీంకు థాంక్స్.

‘బ్రహ్మాస్త్ర’ ఈవెంట్‌కు నేను రావాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు ఆయన దర్శకుడిగా, నేను హీరోగా ఇక్కడకు వచ్చాం. ‘వార్ 2’ని అయాన్ మాత్రమే తెరకెక్కించగలడు అని ఆగస్ట్ 14న అందరికీ తెలుస్తుంది. ఎన్ని నిద్రలేని రాత్రులు అయాన్ గడిపారో నాకు తెలుసు. 2025లో ఓ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌గా అయాన్ నిలుస్తారు. 25 ఏళ్ల క్రితం ‘కహోనా ప్యార్ హై’లో హృతిక్ డ్యాన్స్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. మైకేల్ జాక్సన్ తప్పా ఎవ్వరు కనిపించని నాకు హృతిక్ కనిపించారు. ఇండియాలో ఫైనెస్ట్, రీప్లేస్ చేయని యాక్టర్ హృతిక్ మాత్రమే. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్, అంకిత భావం ఉంటుంది. 25 ఏళ్ల తరువాత ఆయనతో కలిసి, ఆయనతో పాటుగా నటించాను.

హృతిక్ రోషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ డ్యాన్సర్. అలాంటి ఆయన పక్కన డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరు బాగా చేశారన్న పోటీ కాదు ఇది. నేను గొప్ప డ్యాన్సర్ అని మీకు (అభిమానులు) అనిపిస్తుంది. మన కంటే కూడా డ్యాన్స్ చేసేవారున్నారు. నేను ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. నన్ను నేను ఆయనలో చూసుకున్నాను. 75 రోజులు ఆయనతో కలిసి పని చేశాను. మళ్లీ మళ్లీ ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. నేను సౌత్ నుంచి వచ్చాను. రాజమౌళి గారు ఆ హద్దుల్ని చెరిపేశారు. సౌత్ నుంచి వచ్చి నన్ను అంత బాగా చూసుకున్న హృతిక్ గారికి థాంక్స్. ‘వార్ 2’ మూమెంట్స్‌ని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ‘వార్ 2’ అనేది ఎన్టీఆర్ హిందీలోకి వెళ్తున్న చిత్రమే కాదు.. హృతిక్ గారు తెలుగులోకి వస్తున్న చిత్రం.

ఒక తల్లికి పుట్టకపోయినా, నన్ను కడుపులో పెట్టుకుని, నా బాధలో పాలు పంచుకునే, ఆనందంలో ఆనందాన్ని పంచుకునే, నేను నా ఇంట్లో సుఖంగా పడుకున్నా.. అభిమానులకు ఎంత చేసినా, ఏం చేసినా రుణం తీర్చుకోలేను. కొడుకుగా మా నాన్న గారు జన్మను ఇచ్చినా.. నా ఈ జన్మ మాత్రం అభిమానులకే అంకితం. అభిమానుల ప్రేమే నాకు చాలు. అభిమానుల్ని గర్వపడేలా చేసేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ‘వార్ 2’తో మళ్లీ అభిమానుల్ని రెండు కాలర్స్ ఎత్తుకునేలా చేస్తాను. ఎవ్వరెన్ని మాట్లాడుకున్నా సరే బొమ్మ అదిరిపోయింది. పండుగ చేసుకోండి.. ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. చాలా కష్టపడి ఈ మూవీని చేశాం. ఆ ట్విస్టుల్ని మాత్రం బయట పెట్టకండి. ‘వార్ 2’లో డ్యాన్సులు, ఫైట్స్ అదిరిపోయాయి. కావాల్సిన అన్ని అంశాలుంటాయి. ‘వార్ 2’ హిందీ సినిమా మాత్రమే కాదు.. తెలుగు సినిమా కూడా’’ అని అన్నారు.

ALSO READ : https://teluguprabha.net/cinema-news/prabhas-pan-india-movie-the-raja-saab-new-release-date/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad