Rajesh Danda: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ మూవీ దివాళీ విన్నర్‌గా నిలిచింది. జైన్స్ నాని దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. థియేటర్లలో రిలీజై ఇరవై రోజులు దాటినా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. వరల్డ్ వైడ్‌గా నలభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్న ఈ మూవీ నిర్మాత రాజేష్ దండాకు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.
థియేటర్లలో రిలీజైన ఫస్ట్ వీకెండ్‌లో కే ర్యాంప్ మూవీపై నెగెటివ్ కామెంట్స్‌తో పాటు చాలా ట్రోల్స్ వచ్చాయి. ఈ విమర్శలపై నిర్మాత రాజేష్ దండా కొద్ది రోజుల క్రితం ఫైర్ అయ్యారు. ఓ వెబ్‌సైట్ నిర్వాహకుడిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. అమెరికాలో ఉన్న వాడికి చెబుతున్నా పగలగొడతా.. నువ్వు మగాడివైతే తొక్కురా… లుచ్చా… నా కొ…కు.. నా మీద బతికే నా కొ..కా అంటూ కామెంట్స్ చేశారు. రాజేష్ దండా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నిర్మాత కామెంట్స్‌ను తప్పుపట్టిన సదరు వెబ్‌సైట్ నిర్వాహకులు ఛాంబర్‌లో కంప్లైంట్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
తాజాగా రాజేష్ దండా ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టారు. సోమవారం కే ర్యాంప్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో వెట్‌సైట్స్ గురించి గతంలో తాను చేసిన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు రాజేష్ దండా పేర్కొన్నారు. ‘‘గత ప్రెస్‌మీట్‌లో నేను వాడిన పదజాలం ఇబ్బందిగా ఉందని నా సన్నిహితులు చెప్పారు. ఆ సమయంలో సినిమాపై వస్తోన్న విమర్శలను తట్టుకోలేక కోపంతో అలా మాట్లాడాను. తప్పుచేశానని అర్థమైంది. గతంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలను వెనక్కితీసుకుంటున్నాను. నేను ఛాంబర్‌కు ఇచ్చిన లెటర్‌లో కొన్ని తప్పులు దొర్లాయి. మీడియాతో ఎప్పుడు విరోధం పెట్టుకొను. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయబోతున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి’’ అని రాజేష్ దండా పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కాకుండా మీడియా ముఖంగానే క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ముగింపు పలికారు.
కే ర్యాంప్ కంటే ముందు నిర్మాతగా రాజేష్ దండా.. ఊరు పేరు భైరవకోన, సామజవరగమన, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం, మజాకా, బచ్చలమల్లి సినిమాలు చేశారు. ప్రస్తుతం సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ది బ్లాక్‌గోల్డ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు రాజేష్ దండా. అల్లరి నరేష్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి మరో సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read- Harmanpreet Kaur : పుట్టగానే రాసిపెట్టాడు.. హర్మన్‌ప్రీత్ తండ్రి నమ్మకం వెనుక అద్భుతమైన కథ!


