Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభK-Ramp: నేను మనిషినే, అందుకే ఆ భాష వాడాను: రాజేష్ దండా

K-Ramp: నేను మనిషినే, అందుకే ఆ భాష వాడాను: రాజేష్ దండా

K-Ramp: హిట్టు సినిమాను తొక్కాలని చూస్తావా? నా యుద్ధం మీడియా ముసుగులో ఉన్న తెలుగు 360పైనే! కిరణ్ అబ్బవరం నటించిన ‘కె-ర్యాంప్’ చిత్రం విజయం సాధించిన సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్‌లో నిర్మాత రాజేష్ దండా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రివ్యూయర్లు, కొన్ని వెబ్‌సైట్లు చిన్న సినిమాల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

రాజేష్ దండా వ్యాఖ్యలు:

నా సినిమాకు వచ్చిన తక్కువ రేటింగ్స్ చూసి బాధపడ్డాను. సినిమా వినోదం కోసం తీశాం, లాజిక్స్ వెతకడానికి కాదు. మీరు రేటింగ్ ఇవ్వండి, కానీ పక్షపాతం చూపించడం సరికాదు. సినిమా హిట్టైనా, తప్పుడు కలెక్షన్ల లెక్కలు వేస్తూ దుష్ప్రచారం చేస్తున్న ఒక వెబ్‌సైట్‌పై ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. “హిట్టు సినిమాను తొక్కాలని చూస్తావా” అని మండిపడ్డారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/venkatesh-role-in-chiranjeevi-manasankar-varaprasad/

రాజేష్ దండా వివరణ:

తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, రాజేష్ దండా వివరణ ఇచ్చారు.
తన కోపానికి కారణం తెలుగు 360 వెబ్‌సైట్ మాత్రమేనని, ఆ సైట్ తమ రివ్యూ క్రెడిబిలిటీ కోసం సినిమా హిట్టైనా నెగెటివ్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కోట్లు ఖర్చు చేసిన నా సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా? నేనూ మనిషినే కదా. అందుకే ఆ భాష వాడాల్సి వచ్చింది. నా బాధను అర్థం చేసుకోండి. నా యుద్ధం మీడియా మీద కాదు.. మీడియా ముసుగులో సినిమా లను చంపుతున్న తెలుగు 360 వెబ్ సైట్ మీద” అని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకులే తమ సినిమాను ఆదరిస్తున్నారని, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో షోలు నడుస్తున్నాయని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad