Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKaikala Funeral : నేడు అధికార లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు..

Kaikala Funeral : నేడు అధికార లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు..

- Advertisement -

Kaikala Funeral : ఎన్నో వందల సినిమాలతో, వైవిధ్యమైన పాత్రలతో 60 సంవత్సరాలుగా సినిమాలతో అందర్నీ మెప్పించిన నటులు కైకాల సత్యనారాయణ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డిసెంబర్ 23 శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయప్రముఖులు ఆయన ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు.

కైకాల సత్యనారాయణ దాదాపు 700 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా యమగోల సినిమాలో ఎన్టీఆర్ కి ధీటుగా యముడి పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రకే వన్నె తెచ్చి అనంతరం పలు సినిమాల్లో యముడిగా నటించి యముడంటే కైకాల లాగే ఉండేవారేమో అనిపించేలా చేశాడు.

కైకాల మరణానికి సినీ ప్రముఖులే కాక రెండు తెలుగు రాష్త్రాల్లోంచి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియచేశారు. శుక్రవారం అంతా ప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం ఆయన పార్థివదేహాన్ని ఇంటివద్దే ఉంచారు. నేడు కైకాల అంతిమ యాత్ర మహాప్రస్థానం వరకు సాగి అక్కడ తెలంగాణ ప్రభుత్వంచే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆయనకి అన్ని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని తెలిపారు. ఈ అంత్యక్రియల్లో పలువురు ప్రముఖులు, అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad