Sunday, November 16, 2025
HomeTop StoriesKajal Aggarwal: లాయ‌ర్ రోల్‌లో కాజ‌ల్ - సైలెంట్‌గా బాలీవుడ్ మూవీ షూటింగ్ కంప్లీట్‌

Kajal Aggarwal: లాయ‌ర్ రోల్‌లో కాజ‌ల్ – సైలెంట్‌గా బాలీవుడ్ మూవీ షూటింగ్ కంప్లీట్‌

Kajal Aggarwal: కొత్త హీరోయిన్ల జోరుతో కొన్నాళ్లుగా అవ‌కాశాల రేసులో వెనుక‌బ‌డింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. గ్లామ‌ర్ రోల్స్ త‌గ్గుముఖం త‌న రూట్ మార్చింది. క‌థాబ‌ల‌మున్న సినిమాలు, ఛాలెంజింగ్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

- Advertisement -

లాయ‌ర్ రోల్‌లో…
అప్‌క‌మింగ్ బాలీవుడ్ మూవీలో ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్ రోల్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌బోతున్న‌ది. ది ఇండియా స్టోరీ పేరుతో తెర‌కెక్కుతున్న ఈ మూవీ కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. చంద‌న్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమాలో శ్రేయ‌స్ త‌ల్ఫ‌డే, ముర‌ళీ శ‌ర్మ‌, మ‌నీష్ వాద్వా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ది ఇండియా స్టోరీ సినిమా షూటింగ్‌కు సోమ‌వారం నాటితో గుమ్మ‌డికాయ కొట్టేశారు. సైలెంట్‌గా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

పెస్టిసైడ్స్ స్కామ్‌లు…
కోర్ట్ రూమ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ రోల్‌ను ఈ మూవీలో కాజ‌ల్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. పెస్టిసైడ్స్ స్కామ్‌ల పేరుతో జ‌రుగుతున్న మోసాల‌ను ఆవిష్క‌రిస్తూ వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు చంద‌న్ డీకే ది ఇండియ‌న్ స్టోరీ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

Also Read – BAHUBALI THE EPIC: ‘బాహుబలి ది ఎపిక్’ క్లైమాక్స్ లో ‘బాహుబలి 3’? ఫ్యాన్స్‌కు పండుగే!

తొలుత ఈ ఏడాది ఆగ‌స్ట్‌లోనే ది ఇండియా స్టోరీ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ డిలే వ‌ల్ల రిలీజ్ వాయిదా ప‌డింది. త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌ చేయ‌నున్నారు.

రామాయ‌ణ మూవీలో…
ఇది ఇండియా స్టోరీతో పాటు హిందీలో రామాయ‌ణ సినిమా చేస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీలో మండోద‌రి పాత్ర పోషిస్తుంది. రామాయ‌ణ సినిమాలో ర‌ణ‌భీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి రాముడు, సీత పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతుండ‌గా… య‌శ్ రావ‌ణుడిగా న‌టిస్తున్నారు.

భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత‌…
బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజ‌ల్ చేతిలో ప్ర‌స్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైంది. ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్న కాజ‌ల్ ప్ర‌స్తుతం క‌మ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది.

Also Read – High Court: కాళేశ్వరంపై నేడు హైకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad