Kajal Aggarwal Accident Rumours: అందాల తార కాజల్ అగర్వాల్‌కు యాక్సిడెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పరిస్థితి విషమంగా ఉందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో యాక్సిడెంట్ అంశంపై కాజల్ స్పందించింది. తాను క్షేమంగానే ఉన్నానని పేర్కొన్న ఈ బ్యూటీ.. ఆ వార్తలన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టిపడేసింది.
కాజల్ అగర్వాల్‌కు అయిందనే వార్తలు సోమవారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఆందోళన చెందిన అభిమానులు ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. దీనిపై కాజల్ స్పందిస్తూ యాక్సిడెంట్ వార్తలను ఖండించింది. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొంది.
నిజమైన వార్తలను పంచుకోండి: సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి తాను నవ్వుకున్నానని తెలిపింది. ఎందుకంటే నా విషయంలో ఇంతకుమించిన ఫన్నీ న్యూస్ మరోటి ఉండదని.. యాక్సిడెంట్ వార్తలన్నీ పూర్తి అవాస్తవమని వెల్లడించింది. దేవుడి, అభిమానులు దయ వల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నానని పేర్కొంది. ఇలాంటి తప్పుడు వార్తలను అభిమానులు నమ్మొద్దని అన్నారు. ప్రచారం కూడా చేయొద్దని అన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను షేర్ చేసే బదులు ఏదైనా నిజమైన వార్తలను.. పంచుకోండని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలతో సమాజానికి ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంటూ.. నోట్ విడుదల చేశారు.
తెలుగు పరిశ్రమలో కాజల్ అగర్వాల్ ప్రస్థానం: 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి తొలిసారి అడుగుపెట్టింది. అదే సంవత్సరంలో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కెరీర్‌లో ‘మగధీర’ ఒక మైలురాయని చెప్పవచ్చు. తెలుగులో చివరిసారిగా కాజల్ ‘కన్నప్ప’లో నటించింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వచ్చిన కన్నప్ప చిత్రంలో కాజల్ పార్వతీదేవిగా కనిపించింది. ప్రస్తుతం కాజల్ ‘ఇండియన్ 3’లో నటిస్తోంది. అలాగే ‘రామాయణ’లోనూ ఈ అందాల తార నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


