Sunday, June 30, 2024
Homeచిత్ర ప్రభKalki-Bujji countdown: కల్కి-కౌంట్ డౌన్ స్టార్ట్స్-బుజ్జి కోసమే ఇదంతా

Kalki-Bujji countdown: కల్కి-కౌంట్ డౌన్ స్టార్ట్స్-బుజ్జి కోసమే ఇదంతా

వల్డ్ వైడ్ 27 జూన్ న రిలీజ్

మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ నుంచి మే 22న రివిల్ కానున్న 5వ సూపర్‌స్టార్ & భైరవకు నమ్మకమైన స్నేహితుడు ‘బుజ్జి’.

- Advertisement -

మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ చుట్టూవున్న ఎక్సయిట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా సినీ ఔత్సాహికులలో నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. మే 22, 2024న ఐదవ సూపర్‌స్టార్, భైరవ ప్రాణ స్నేహితుడైన బుజ్జిని రివల్ చేయనున్నారనే ఎనౌన్స్మెంట్ తో ఎక్సయిట్మెంట్ అవధులు లేని ఆనందాన్ని తాకింది.

‘ఫ్రమ్ స్క్రాచ్ EP4: బిల్డింగ్ ఎ సూపర్‌స్టార్’ అనే పేరుతో బిహైండ్ ది స్క్రీన్ గ్లింప్స్ తో, జూన్ 2020లో దర్శకుడు నాగ్ అశ్విన్ గొప్ప విజన్ తో ప్రారంభించినప్పటి నుంచి “సూపర్‌హీరో”, “భైరవ’గా ప్రజెంట్ చేసిన వీడియోతో క్రియేటర్‌లు ప్రేక్షులుని అద్భుతమైన ప్రయాణంలో తీసుకెళ్తారు. ‘బెస్ట్ ఫ్రెండ్,” “బెస్ట్ కంపానియన్” బుజ్జి నెటిజన్లను గెస్సింగ్ లో వుంచడంతో పాటు 5వ సూపర్‌స్టార్ గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిని కలిగిస్తుంది.

2 నిమిషాల 22 సెకన్ల వీడియో గ్యారేజ్ సెట్టింగ్‌లో ప్రభాస్‌తో ఒక మిస్టీరియస్ ఎన్‌కౌంటర్‌తో సహా టీసింగ్ గ్లింప్స్ ని అందిస్తూ, మే 22న బుజ్జి గ్రాండ్ డెబ్యు కోసం ఆసక్తిని పెంచుతుంది.

ఇటీవల కల్కి 2898 AD నుంచి విడుదలైన అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర ప్రేక్షకులని మంత్రుముగ్దులని చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీషు భాషలలో రివిల్ టీజర్, ట్రూ పాన్-ఇండియన్ టీజర్‌గా సెలబ్రేట్ చేసుకుంది.

విజనరీ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD ఈ సంవత్సరం సినిమాటిక్ ఈవెంట్‌గా నిలుస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి సూపర్ స్టార్స్ కూడిన సమిష్టి తారాగణంతో, ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మాణంలో, 27 జూన్ 2024న ‘కల్కి 2898 AD’ వరల్డ్ వైడ్ మ్యాసీవ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News