Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభKalyan Ram: కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే

Kalyan Ram: కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే

మహిళా దినోత్సవం సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో అలనాటి నటి విజయశాంతి(Vijayashanthi) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విజయశాంతి– కళ్యాణ్ రామ్ తల్లికొడుకులుగా నటించబోతున్నారు. దీంతో ఈ సినిమాకు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఇక మూవీలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటం విశేషం. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

- Advertisement -

గతంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వైజయంతి ఐపీఎస్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా అదరగొట్టారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాకు అర్జున్ సన్నాఫ్ వైజయంతి అని పెట్టడం సినిమాపై ఆసక్తిని పెంచింది. కాగా ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయశాంతి.. మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్ర పోషించిన విషయం విధితమే. మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad