Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభKamal Haasan : చెన్నై హాస్పిటల్‌లో కమల్ హాసన్.. ఆందోళనలో అభిమానులు

Kamal Haasan : చెన్నై హాస్పిటల్‌లో కమల్ హాసన్.. ఆందోళనలో అభిమానులు

- Advertisement -

Kamal Haasan : కమల్ హాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఈ సినిమా కమల్ కి ఫుల్ జోష్ ఇచ్చింది. విక్రమ్ సినిమా దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసింది. విక్రమ్ తర్వాత వరుస సినిమాలని లైన్లో పెట్టారు కమల్.

తాజాగా బుధవారం నాడు హైదరాబాద్ కి వచ్చిన కమల్ కళాతపస్వి విశ్వనాథ్ ని కలిశారు. అనంతరం ఆయన చెన్నై వెళ్లిపోయారు. కమల్ చెన్నై వెళ్ళాక కొద్దిగా అస్వస్థతకి గురవడం, జ్వరం రావడంతో అక్కడే ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. వైద్యులు కమల్ కి పలు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. కంగారుపడాల్సిందేమి లేదని, కొద్దిగా జ్వరంతో ఉన్నారని నేడు గురువారం రోజు డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు వైద్యులు.

కమల్ హాసన్ ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నారు. నేడు డిశ్చార్జ్ అవ్వనున్నారు. మరో రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కమల్ హాస్పిటల్ లో చేరారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళనకి గురయ్యారు. జ్వరంతో హాస్పిటల్ కి వెళ్లారని, ఇవాళ డిశ్చార్జ్ అవుతారని తెలియడంతో కమల్ అభిమానులు ఆయన క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad