Kamal Haasan: కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ కమల్‌హాసన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కమల్ వ్యాఖ్యలను పలువురు సినీ, రాజకీయ వర్గాలు తప్పుపడుతున్నారు. టీవీ నటుడు రవిచంద్రన్ ఏకంగా కమల్‌హాసన్‌ను గొంతు కోసి చంపేస్తానంటూ హెచ్చరించారు. కమల్ హాసన్ సినిమాలను బాయ్‌కట్ చేయాలంటూ కామెంట్స్ చేశాడు.
అగరం ఫౌండేషన్ వేడుకలో…
ఇటీవల జరిగిన అగరం ఫౌండేషన్ ఛారిటీ ఈవెంట్‌కు కమల్ హాసన్ ఛీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో విద్య ఒక్కటే సనాతన ధర్మం సంకెళ్లను, నియంతృత్వ ధోరణులను అంతం చేయగలదని కమల్‌హాసన్ కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ కామెంట్స్‌పై తమిళనాడు భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సనాతన ధర్మంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై తమిళ టీవీ నటుడు రవిచంద్రన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమల్‌హాసన్ ఓ బుర్రతక్కువ పొలిటీషియన్ అంటూ ఎద్దేవా చేశారు, అతడి సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ రవిచంద్రన్ పేర్కొన్నారు. ఇంకోసారి కమల్‌హాసన్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే నేనే అతడి గొంతు కొస్తాను అంటూ రవిచంద్రన్ కామెంట్స్ చేశారు.
Also Read- Pooja Hegde: బాహుబలి 3లో హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వమని ప్రభాస్‌ను అడుగుతా – మనసులో మాట చెప్పేసింది
పోలీసులకు కంప్లైంట్…
రవిచంద్రన్ బెదిరింపులపై కమల్‌హాసన్ అభిమానులతో పాటు ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమల్‌హాసన్‌ను చంపేస్తానని కామెంట్స్ చేసిన రవిచంద్రన్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బెదిరింపుల నేపథ్యంలో కమల్‌హాసన్‌కు భద్రతా పెంచాలంటూ చెన్నై పోలీస్ కమీషనర్‌కు మక్కల్ నీది మయ్యం పార్టీ నేతలు కోరారు. అధికార పార్టీ డీఎమ్‌కే మద్ధతుతో ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా కమల్‌హాసన్ ప్రమాణం స్వీకారం చేశారు.
కాగా విక్రమ్‌తో కెరీర్‌లోనే పెద్ద హిట్‌ను అందుకున్న కమల్‌హాసన్‌కు భారతీయుడు 2, థగ్‌లైఫ్ సినిమాలు మాత్రం నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం భారతీయుడు 3 మూవీ చేస్తున్నారు కమల్‌హాసన్. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.


