Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభKamal Haasan: రోజూ స్పెషల్ హెలిక్యాప్టర్ లో వచ్చి పోతున్న సూపర్ స్టార్ కమల్ హాసన్

Kamal Haasan: రోజూ స్పెషల్ హెలిక్యాప్టర్ లో వచ్చి పోతున్న సూపర్ స్టార్ కమల్ హాసన్

ఇండియన్-2 సినిమా భారీ బడ్జెట్ తో చాలా కాలంగా తెరకెక్కుతోంది. హీరోయిన్లను మార్చటం, కరోనా పాండమిక్ వంటివాటి నేపథ్యంలో సినిమా చాలా ఆలస్యంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు కమల్ హాసన్ కూడా తన ఇతర ప్రాజెక్టులు, తమిళ్ బిగ్ బాస్ యాంకరింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.

- Advertisement -

ప్రస్తుతం కమల్ హాసన్ తిరుపతి నుంచి స్పెషల్ హెలిక్యాప్టర్ లో రోజూ గండికోటకు వెళ్లి వస్తున్నారు. కడప జిల్లాలోని గండికోటలో ఇండియన్-2 సినిమా షూటింగ్ షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. ఇక్కడే మకాం వేసిన డైరెక్టర్ శంకర్ త్వరగా ఇండియన్-2 సినిమాను చుట్టేసి, రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. భారతీయుడు సూపర్ హిట్ సినిమాగా రికార్డులు తిరగరాసింది. దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా ప్రయోగాలు చేస్తున్నారు. కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad