Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభThug Life: ఆసక్తికరంగా కమల్ హాసన్ 'థగ్ లైఫ్' టీజర్

Thug Life: ఆసక్తికరంగా కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్

Thug Life| లోక నాయకుడు, సీనియర్ హీరో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం(Mani Ratnam) కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’(Thug Life). భారీ తారాగణం, బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలు రేపాయి. నేడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ అభిమానులకు ఓ అప్‌డేట్ ఇచ్చింది. మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఓ టీజర్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

టీజర్ ఆసక్తికరంగా ఉంది. కమల్ హాసన్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ఇక యంగ్ హీరో శింబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సముద్రపు దొంగల నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కమల్- మణితర్నం కలయికలో 36 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు జోజు జార్జ్, హీరో గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమన్ సంగీతం అందిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టారు. బాక్సాఫీస్ వద్ద రూ.200కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి శభాష్ అనిపించారు. అయితే ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు2’ సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో కమల్ అభిమానులు ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News