తమిళ సినీ రంగానికి గర్వకారణంగా నిలిచిన కమల్ హాసన్ మరియు దర్శక దిగ్గజం మణిరత్నం మళ్లీ ఒక్కటయ్యారు. వీరి కలయికలో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్’ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, భావోద్వేగాలు, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే బలమైన సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ ఇప్పటికే సినీ అభిమానుల్లో కుతూహలం రేకెత్తిస్తోంది.
36 ఏళ్ల విరామం తరువాత కమల్-మణిరత్నం కాంబినేషన్ మరోసారి తెరపైకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. కథానాయికగా త్రిష కనిపించనుండగా, జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మి వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో అలరించనున్నారు.
సంగీతమైతే ఏఆర్ రెహమాన్ నుంచి వస్తోంది అంటేనే మ్యూజిక్ ఎలెమెంట్‌పై ఆసక్తి పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘థగ్ లైఫ్’, కమల్ హాసన్‌ను మరో మారు అత్యున్నత స్థాయిలో చూపించనున్న ఆశలు కలిగిస్తోంది. అన్ని భాషల ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఈ సినిమా జూన్ 5న థియేటర్లలోకి రానుంది. విడుదలైన ట్రైలర్ చూసినవారు ఇది కేవలం గ్యాంగ్‌స్టర్ కథ కాదు, భావోద్వేగాలకు, ఆకర్షణీయ చిత్రీకరణకు, సంగీతానికి సమ్మేళనంగా రూపొందిన ఒక విజువల్ ఫెస్టివల్ అని అభిప్రాయపడుతున్నారు.