Kamalhaasan- Rajnikanth: సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యులు కమల్ హాసన్ మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నైలోని రజినీ నివాసానికి వెళ్లిన కమల్ ఆయనతో పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని కమల్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన కొత్త ప్రయాణం గురించి స్నేహితుడు రజినీకాంత్‌తో పంచుకున్నానని తెలిపారు. ఇందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈమేరకు రజినీతో దిగిన ఫొటోలను షేర్ చేశారు.
కాగా కమల్ హాసన్ ఇటీవల రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో తమిళనాడులోని అధికార DMK పార్టీతో జరిగిన ఒప్పందం ప్రకారం కమల్‌కు రాజ్యసభ సీట్ ఇచ్చారు. దీంతో పెద్దల సభకు ఎన్నికైనా కమల్ తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టనున్నారు. 2021లో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చివరకు కమల్ కూడా గెలవలేకపోయారు. ఈ నేపథ్యయంలో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. విక్రమ్ సినిమాతో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టారు. అయితే రాజకీయంగా మాత్రం అంత యాక్టివ్‌గా లేరు.
ఈ క్రమంలో రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే మద్దతుగా నిలిచారు. కానీ డీఎంకేకు మద్దతు ఇవ్వడంపై పలు విమర్శలు ఎదుర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఉన్న డీఎంకే సినీ గ్లామర్ ఉన్న కమల్‌ను దగ్గరకు తీసుకుంది. దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టడంతో పాటు అధికారంలోకి రావడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్‌కు చెక్ పెట్టేందుకు కమల్‌ను వాడుకుంటున్నట్లు తమిళ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు రజినీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు.
Also Read: టెన్షన్‌లో మిడ్ రేంజ్ హీరోలు
రజినీ-కమల్ ఒకేసారి సినీ జీవితం ప్రారంభించారు. దిగ్గజ దర్శకుడు బాలచందర్ వీరిద్దరిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 1979లో అందరమైన అనుభవం చిత్రం ద్వారా రజినీ-కమల్ వెండితెరపై అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇద్దరు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇద్దరు తమదైన శైలిలో అభిమానులను సంపాందించుకున్నారు. రజినీ తన మ్యానరిజమ్స్‌తో మాస్ హీరోగా ఎదిగితే.. కమల్ తన నటనతో లోకనాయకుడిగా ఎదిగారు.
புதிய பயணத்தை நண்பர் @rajinikanth உடன் பகிர்ந்தேன். மகிழ்ந்தேன். pic.twitter.com/n9R4HgsxlC
— Kamal Haasan (@ikamalhaasan) July 16, 2025


