Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKannappa OTT Release: ఓటీటీలోకి వస్తేస్తున్న మంచు విష్ణు కన్నప్ప..! ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అంటే..!

Kannappa OTT Release: ఓటీటీలోకి వస్తేస్తున్న మంచు విష్ణు కన్నప్ప..! ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అంటే..!

Manchu Vishnu-Kannappa Movie:  మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ ఎపిక్‌ కన్నప్ప సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. శివభక్తుడు కన్నప్ప కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ముఖేష్ గతంలో మహాభారతం టీవీ సీరియల్‌కి దర్శకత్వం వహించి విశేషమైన గుర్తింపు పొందగా, ఇప్పుడు కన్నప్పతో పాన్‌-ఇండియా స్థాయిలో తన ప్రతిభను చూపించాడు.

- Advertisement -

ఐదు భాషల్లో ఒకేసారి…

ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించారు. భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందించిన ఈ సినిమా ఐదు భాషల్లో ఒకేసారి విడుదలైంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ప్రేక్షకులు ఒకే సమయంలో ఈ సినిమాను థియేటర్లలో చూశారు.

సినిమాలో ప్రధాన పాత్రలతో పాటు అనేక ప్రముఖ నటులు అతిథి పాత్రల్లో కనిపించారు. మోహన్ బాబు, శివబాలాజీ, ప్రభాస్ రుద్రుడి పాత్రలో, అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ అగర్వాల్ పార్వతిగా నటించారు. ఇంకా మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా, మధుబాల, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ తారాగణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Also Read: https://teluguprabha.net/cinema-news/vijay-deverakonda-and-rashmika-mandanna-special-attraction-at-new-york-india-day-parade/

చిత్రీకరణ విషయానికి వస్తే, ఈ సినిమాకు ఎక్కువ భాగం న్యూజిలాండ్ లో చిత్రీకరించారు. విస్తారమైన లొకేషన్లు, ఆధునిక టెక్నాలజీ సాయంతో రూపొందిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ చివరకు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తర్వాత మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, మైథలాజికల్ కథ కావడంతో విశేషమైన ఆకర్షణ పొందింది.

థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు ప్రేక్షకులు కన్నప్ప ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపైకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో సినిమా 6 నుంచి 7 వారాల్లోనే డిజిటల్ రిలీజ్ అవుతుంటే, మరికొన్నిసార్లు ఆలస్యమవుతుంది. కానీ కన్నప్ప సినిమా విడుదలై దాదాపు 10 వారాలు దాటినా, ఇప్పటివరకు అధికారిక ఓటీటీ అప్‌డేట్ రాలేదు.

ఓటీటీలోకి రావడానికి..

అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం కన్నప్ప సినిమా ఓటీటీలోకి రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సెప్టెంబర్ 5న ఈ సినిమాను ప్రైమ్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తేదీపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

ఓటీటీ రిలీజ్ విషయంపై స్పష్టమైన అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందినా, ఇప్పుడు సెప్టెంబర్ 5న విడుదల కానున్నట్టు వార్తలు రావడంతో మళ్లీ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా థియేటర్స్‌లో మిస్ అయిన ప్రేక్షకులు, మరొకసారి సినిమాను చూడాలనుకునే అభిమానులు ఈ డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad