Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభKangana Ranaut : చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. సెట్ అవుద్దంటారా??

Kangana Ranaut : చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. సెట్ అవుద్దంటారా??

- Advertisement -

Kangana Ranaut : రజినీకాంత్ హీరోగా 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో జ్యోతిక చంద్రముఖిగా క్లాసికల్ డ్యాన్స్ తో పాటు, అమాయక సాధారణ గృహిణి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులని భయపెట్టింది, మెప్పించింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్నేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ అనౌన్స్ చేశారు.

అయితే ఈ సారి రజినీకాంత్ బదులు రాఘవ లారెన్స్ చంద్రముఖి 2లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా వర్క్స్ మొదలు పెట్టారు కూడా. చంద్రముఖి సినిమాకి దర్శకత్వం వహించిన వాసునే ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు. మరి చంద్రముఖిగా ఎవరు నటిస్తారు అని అంతా అనుకున్నారు. జ్యోతిక నో చెప్పడంతో ఈ సారి మరో హీరోయిన్ ని తీసుకున్నారు చిత్రయూనిట్.

చంద్రముఖి 2 సినిమాలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా కన్ఫామ్ చేసింది కంగనా. బాలీవుడ్ లో లేడి ఓరియెంటెడ్ సినిమాలు, యాక్షన్ సినిమాలు చేసే కంగనా చంద్రముఖి పాత్రకి సెట్ అవుతుందా అని కొంతమంది భావిస్తున్నారు. అయితే కంగనా మొదటి నుంచి కూడా వివిధ రకాల పాత్రల్ని పోషించింది కాబట్టి చంద్రముఖిగా కూడా మెప్పిస్తుంది అంటున్నారు చిత్ర యూనిట్. మరి కంగనా చంద్రముఖిగా సౌత్ ప్రేక్షకులని ఏ మేరకి మెప్పిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News