పాపులర్ స్టార్ హీరో, బాలీవుడ్ రాజకుమారుడిగా పేరుగాంచిన రణబీర్ కపూర్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. రణబీర్ ఆయన భార్య-హీరోయిన అలియా భట్ ను టార్గెట్ చేసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ చేసి బాంబు పేల్చారు. రణబీర్, అలియా తనను వెంబడించి, మానసికంగా వేధిస్తున్నారని, తన స్టేటస్ లు సైత్ ఈ స్టార్ కపుల్ లీక్ చేస్తున్నారని భారీ ఆరోపణలే చేశారు కంగనా.
వుమెనైజర్ అయిన రణబీర్ వద్ద ప్రస్తుతం తన మాజీ స్టాఫ్ పనిచేస్తున్నారన్న కంగన, తన కదలికలన్నీ ఈ జంట పసిగడుతోందన్నారు. ఆఖరుకి తాను ధరించే డ్రెస్, నగలనే అలియా తన పెళ్లిలో ధరించిందని సరికొత్త కామెంట్స్ మొదలుపెట్టారు కంగన. అలియా-రణబీర్ ల పేర్లు మాత్రం చెప్పకుండా..ఇన్స్టాలో చాలా పెద్ద స్టోరీ పోస్ట్ చేసిన కంగనా తాను టార్గెట్ చేస్తున్నది ఎవరినో గెస్ చేసేందుకు అవసరమైన అన్ని క్లూలు ఇచ్చారు. తనపై గట్టి నిఘా పెట్టిన రణబీర్.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ పై కూపీ తీస్తున్నాడని, ఇందుకు ఓ జర్నలిస్టులను ఆయన నియమించారని వివాదాస్పద పోస్టు చేశారు.
నెపో మాఫియా బ్రిగేడ్ తనను వేధిస్తోందని, తన ప్రతి అడుగు వాళ్లకు ఎలా తెలుస్తోందని ఘాటు పదాలతో వాపోయారు. తన ఇంటి ఇంటీరియర్ మొదలు, తనలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని అలియాపై రణబీర్ ఒత్తిడి తెస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇందుకు అలియాను ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాలని కూడా హీరో తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడని, చివరికి తన హెయిర్ స్టైలిస్ట్ మొదలు తన పాత వ్యక్తిగత సిబ్బందినే స్టార్ కపుల్ అపాయింట్ చేసుకోవటంలో ఆంతర్యం ఏముందని నిలదీస్తున్న కంగనా పోస్ట్ ఆసక్తిగా మారింది.