Kangana Ranaut On Live-In relationships: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేస్తుంది. అవతల ఉంది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, పొలిటీషియన్ అయినా లెక్క చేయదు. ఈ మధ్య కాస్త కంగనా హడావిడి తగ్గింది. అయితే, తాజాగా తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. పెళ్లయిన మగవారితో సంబంధాలు పెట్టుకునే విషయంలో సొసైటీ ఎప్పుడూ ఆడవారినే దోషుగా చూస్తుందని, కంగనా ఆవేదన వ్యక్తం చేశారు.
కంగనా, రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన వ్యక్తిగత జీవితం గురించి వచ్చే విమర్శలతో పాటుగా, ఇప్పటితరం డేటింగ్ విషయాలపై కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే తపన ఉన్న అమ్మాయిలను పెళ్లయి, పిల్లలున్న మగవాళ్ళు తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నించినప్పుడు.. సొసైటీ మొత్తం ఆ అమ్మాయినే వేలెత్తి చూపిస్తుంది. అంటూ కంగనా చెప్పుకొచ్చారు. ఇటువంటి, సందర్భాల్లో పురుషుడి తప్పును ఎవరూ పట్టించుకోరని, కేవలం మహిళల మీదనే నిందలు వేస్తారని మాట్లాడారు.
Also Read – Actress Anandhi: లేలేత అందాలతో మాయ చేస్తున్న ఆనంది
సినీ కెరీర్ లో “ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలతో పెళ్లయిన వ్యక్తి సంబంధం పెట్టుకోవాలని వంకరబుద్ది చూపడం తప్పు కాదా? కానీ, నిందలు మాత్రం అమ్మాయి మీదే వేస్తారు” అని కంగనా పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుతం డేటింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్న విషయం గురించి ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ యాప్‌లను “సమాజంలోని మురికి కాలువలు” అంటూ పోల్చారు. ఆత్మవిశ్వాసం లేనివాళ్ళు, పక్కవాళ్ళ మెప్పు పొందాలనుకునే వాళ్ళు ఇలాంటి యాప్‌లను వాడతారని కంగనా విమర్శించారు.
నేటి యువత తమ జీవిత భాగస్వామిని చదువుకునే రోజుల్లో గానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లి ద్వారా గానీ ఎంచుకోవడం మంచిదని కంగనా సూచించారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు స్త్రీలకి ఎంతమాత్రం సేఫ్ కాదని కంగనా వివరించారు. ఇలా సహజీవనం చేయడం వల్ల అమ్మాయి గర్భం దాల్చితే, ఆ అమ్మాయికి తన ఫ్యమిలీ నుంచి సపోర్ట్ ఉండదని తెలిపారు. దీనివల్ల అలాంటి అమ్మాయిలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కంగనా, హెచ్చరించారు. మొత్తంగా ఆధునిక సంబంధాల కన్నా సంప్రదాయ పద్ధతులే అన్ని విధాలుగా మంచిదని కంగన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


