Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSu From So: 5 కోట్ల బ‌డ్జెట్.. 115 కోట్ల క‌లెక్ష‌న్స్.. ఓటీటీలోకి క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్...

Su From So: 5 కోట్ల బ‌డ్జెట్.. 115 కోట్ల క‌లెక్ష‌న్స్.. ఓటీటీలోకి క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ హార‌ర్ కామెడీ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్‌

Su From So: క‌న్న‌డంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించింది సు ఫ్ర‌మ్ సో మూవీ. నూత‌న న‌టీన‌టుల‌తో కేవ‌లం ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిన్న సినిమా 115 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి చ‌రిత్ర‌ను సృష్టించింది. ఈ ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న మూవీగా నిలిచింది.

- Advertisement -

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో…
ఈ క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. సెప్టెంబ‌ర్ 5న డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో సు ఫ్ర‌మ్ సో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. క‌న్న‌డంతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల‌వుతోన్న‌ట్లు చెబుతోన్నారు.

Also Read – Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేశ్ మండపంలో గర్భిణి ప్రసవం..

జేపీ తుమినాడ్ డైరెక్ట‌ర్‌…
సు ఫ్ర‌మ్ సో మూవీకి జేపీ తుమినాడ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ హార‌ర్ కామెడీ మూవీతో డైరెక్ట‌ర్ శాండ‌ల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ష‌నీల్ గౌత‌మ్‌, సంధ్య అరెకెరెతో పాటు డైరెక్ట‌ర్ జేపీ తుమినాడ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. క‌న్న‌డ అగ్ర ద‌ర్శ‌క‌న‌టుడు రాజ్ బీ శెట్టి ఈ సినిమాను నిర్మిస్తూనే ఇందులో ఓ గెస్ట్ రోల్‌లో క‌నిపించారు. స్వామిజీ క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. సు ఫ్ర‌మ్ సో మూవీని అదే పేరుతో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ తెలుగులోకి డ‌బ్ చేసింది. క‌న్న‌డంలో సూప‌ర్ హిట్టైన ఈ మూవీ తెలుగులో మాత్రం నిరాశ‌ను ప‌రిచింది.

ద‌య్యం ప‌డితే…
వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా హార‌ర్ కామెడీ మూవీగా సు ఫ్ర‌మ్ సో మూవీని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ జేపీ తుమినాడ్‌. అంత‌ర్లీనంగా మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న వేధింపుల‌కు సంబంధించి ఓ మెసేజ్‌ను ట‌చ్ చేశాడు. అశోక్ అనే వ్య‌క్తికి ద‌య్యం ప‌డుతుంది. ద‌య్యం వార్త ఊరిలో సంచ‌ల‌నంగా మారుతుంది. ఆ ద‌య్యం బారి నుంచి అశోక్‌ను కాపాడ‌టానికి ఊరి పెద్ద ర‌వ‌న్న ఏం చేశాడు? అశోక్‌ను ఆవ‌హించిన ద‌య్యం కార‌ణంగా ఊరి ప్ర‌జ‌లంతా ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు? ఈ స‌మ‌స్య నుంచి వారిని గ‌ట్టెక్కించిన క‌రుణాజీ స్వామిజీ ఎవ‌రు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. సు ఫ్ర‌మ్ సో మూవీకి సుమేద్‌, సందీప్ తుల‌సీదాస్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక పాట‌కు రాజ్ బీ శెట్టి సాహిత్యాన్ని అందించారు.

Also Read – Kamareddy floods : కామారెడ్డిపై వరుణుడి పంజా.. జలదిగ్బంధంలో జనం – స్థంభించిన రవాణా వ్యవస్థ!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad