Wednesday, October 30, 2024
Homeచిత్ర ప్రభJailer Movie: యాక్షన్ స్టార్ట్.. సూపర్ స్టార్ కి విలన్ గా కన్నడ స్టార్ హీరో!

Jailer Movie: యాక్షన్ స్టార్ట్.. సూపర్ స్టార్ కి విలన్ గా కన్నడ స్టార్ హీరో!

- Advertisement -

Jailer Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొన్ని సినిమాలు ప్రయోగాత్మకంగా వెళ్లడంతో పరాజయం పాలయ్యాయి. దీంతో మళ్ళీ రజినీకాంత తన మాస్ యాక్షన్ రూట్లోకి వచ్చేసారు. డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో జైలర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నరసింహ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రజినీకాంత్ తో పాటు ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా చిత్ర యూనిట్ మరో అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. జైలర్ సినిమాలో రజినీకాంత్ తో పాటు పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్టు, షూట్ లో జాయిన్ అయినట్టు తెలిపారు. షూటింగ్ స్పాట్ నుంచి ఓ లుక్ కూడా విడుదల చేశారు. ఈ కాంబినేషన్ చూసి అంతా షాక్ అయ్యారు. శివన్న అభిమానులు కూడా ఈ న్యూస్ తెలిసి ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే జైలర్ సినిమాలో రజినీకాంత్ కి విలన్ గా శివన్న నటిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ ప్రకటించలేదు. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు ఉండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. 2023 సమ్మర్ కి ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తెరపై ఎన్ని అద్భుతాలు చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News