Wednesday, June 11, 2025
Homeచిత్ర ప్రభKannappa: 'కన్నప్ప' కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు

Kannappa: ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు

మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీమ్‌ ప్రాజెక్టు ‘కన్నప్ప’ (Kannappa)తో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, నయనతార, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, మధుబాల, మోహన్ బాబు, శరత్ కుమార్, జగపతిబాబు లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి.

- Advertisement -

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత ఏప్రిల్ 25, 2025న ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో వీఎఫ్‌క్స్(VFX) పనుల ఆలస్యం కారణంగా సినిమాను వాయిదా వేశారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మంచు మోహన్ బాబు, విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను సీఎం యోగి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News