మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ (Kannappa)తో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, నయనతార, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, మధుబాల, మోహన్ బాబు, శరత్ కుమార్, జగపతిబాబు లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి.
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో వీఎఫ్‌క్స్(VFX) పనుల ఆలస్యం కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు హీరో విష్ణు ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని.. ప్రేక్షకులు సహకరించాలని కోరారు. సినిమా విడుదల వాయిదా వేసినందుకు తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు.