మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘కన్నప్ప’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను మోహన్ బాబు తెరకెక్కిస్తున్నారు. పలు ఇండస్ట్రీలకు చెందిన యాక్టర్స్ ఈ మూవీలో నటిస్తుండటంతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అయితే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను మార్చి 1న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని, వారి ఎదురుచూపులకు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ వారిని అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు టీజర్‌లో ప్రభాస్ కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ‘కన్నప్ప’ టీజర్ పై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.