మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ (Kannappa)చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది.
తాజాగా మూవీ ట్రైలర్ విడుదలపై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 13న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఓ పోస్టర్ కూడా విడుల చేశారు. మూవీ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ లో విష్ణు మాత్రమే కనిపించారు. ప్రభాస్ కు సంబంధించి కేవలం ఒక పోస్టర్ మాత్రమే వదిలారు. దీంతో ట్రైలర్ లోనే డార్లింగ్ సీన్స్ ఉంటాయని ఆశిస్తున్నారు.
విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పౌరాణిక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పరమశివుని గొప్ప భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ పరమశివుడిగా కనిపించనుండగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవి పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత రంకా, కౌశల్ మందా, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీనటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. మరి ట్రైలర్ విడుదలతో సినిమాపై ఇంకెంత ఆసక్తి రేపుతారో వేచి చూడాలి.
Kannappa Trailer: ‘కన్నప్ప’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES