Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKannappa Trailer: 'కన్నప్ప' ట్రైలర్ వచ్చేసింది

Kannappa Trailer: ‘కన్నప్ప’ ట్రైలర్ వచ్చేసింది

Kannappa Official Trailer: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ (Kannappa)చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాట‌లు, పోస్ట‌ర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. తిన్నడుగా విష్ణు, రుద్రగా ప్రభాస్‌, శివుడిగా అక్షయ్‌కుమార్‌ నటించారు. ట్రైలర్ లో విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఆ పెద్దోళ్ల కన్నా నేనే పెద్దోడ్ని’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఇంట్రస్టింగ్ గా ఉంది. మొత్తానికి ట్రైలర్ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేసింది.

ఇక విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పౌరాణిక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పరమశివుని గొప్ప భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ పరమశివుడిగా కనిపించనుండగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవి పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత రంకా, కౌశల్ మందా, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీనటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

కాగా ఈ సినిమా ట్రైలర్ ముందుగా ఈనెల 13న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ ఒకరోజు పాటు వాయిదా వేస్తున్నట్లు విష్ణు ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad