kantara chapter 1 TICKET HIKES : “కళకు భాష లేదు” అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తెలుగు సినీ వర్గాలలో తీవ్ర వ్యతిరేకతను, ఆందోళనను రేకెత్తిస్తోంది. రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం ‘కాంతారా ఛాప్టర్ – 1’ కి టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలపడం తెలుగు సినిమాకు ద్రోహం చేయడమేనని అన్ని వర్గాలు మండిపడుతున్నాయి.
తెలుగు చిత్రాలైన ‘RRR’, ‘గేమ్ ఛేంజర్’, ‘ఓజీ’ వంటి వాటి విషయంలో కర్ణాటకలో టికెట్ ధరలు పెంచడానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కొన్ని సందర్భాల్లో పోస్టర్లను కూడా తొలగించే చర్యలకు దిగినా, కన్నడ సినీ పరిశ్రమ స్పందించడం లేదు.ఇటువంటి పరిస్థితుల్లో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు “పెద్ద మనసు” చూపించి కన్నడ చిత్రానికి ప్రోత్సాహం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని తెలుగు నిర్మాతలు, పంపిణీదారులు ప్రశ్నిస్తున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/hyd-piracy-racket-busted/
కర్ణాటకలో మన సినిమాను వ్యాపారపరంగా నష్టపరిచే ప్రయత్నం జరుగుతుంటే, మన ప్రభుత్వమే ఇక్కడ వారికి లాభం చేకూర్చే నిర్ణయం తీసుకోవడం విడ్డూరం.
నష్టపోతున్న తెలుగు నిర్మాతలు
ప్రోత్సాహం కరువైంది: తెలుగు సినిమాకు అక్కడ కనీస ప్రోత్సాహం, గౌరవం లభించడం లేదు. పోస్టర్లు చించివేసినా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ మౌనం వహిస్తోంది.
ఎప్పుడు మాట్లాడాలి: “రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి” అనే సూచన అద్భుతమైనదే అయినా, ముందుగా తెలుగు సినిమా హక్కులను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమ రాష్ట్ర ప్రభుత్వంపై లేదా? మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎవరికి పెద్ద మనసు చూపించాలి?
ALSO READ: https://teluguprabha.net/cinema-news/og-movie-mega-family-celebration/
‘జాతీయ భావన’ కేవలం మాకేనా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు “జాతీయ భావనలు” గుర్తు చేయడంపై సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“జాతీయ భావన కేవలం తెలుగు పరిశ్రమకు మాత్రమే వర్తిస్తుందా? కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు, అక్కడి ప్రేక్షకులకు ఈ భావన వర్తించదా? మాకు వ్యాపారపరంగా నష్టం కలుగుతున్నప్పుడు, మాకు అండగా నిలబడకుండా, వారి సినిమాకు టికెట్ ధరలు పెంచడం దేనికి సంకేతం?”


