Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRishab Shetty: రూ. 650 కోట్ల మార్క్ దాటిన 'కాంతార చాప్టర్ 1': 2025లో సెకండ్...

Rishab Shetty: రూ. 650 కోట్ల మార్క్ దాటిన ‘కాంతార చాప్టర్ 1’: 2025లో సెకండ్ ఫిల్మ్

హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి రూపొందించిన ‘కాంతార చాప్టర్ 1’ మూవీ బాక్సాఫీస్ దగ్గర తన హవా కొనసాగిస్తూ రూ. 650 కోట్ల మార్కును అందుకుంది. రుక్మిణీ వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్ర్లు చేసిన ఈ సినిమా ‘కేజీఎఫ్ 2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాగా రెండో స్థానాన్ని ఇప్పటికే ఆక్రమించింది. రానున్న రోజుల్లో కన్నడ ఇండస్ట్రీలో మరిన్ని మైలురాళ్లను ఈ సినిమా సాధిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు. కాగా, 2025లో విడుదలైన అన్ని భారతీయ సినిమాల్లో రూ. 650 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న రెండో చిత్రంగా నిలిచింది.

- Advertisement -

థియేట్రికల్ హక్కుల పరంగా చూసినప్పుడు అంతర్జాతీయంగా ఆశించిన స్థాయికి కాస్త తక్కువగా కలెక్షన్ ఉందని చెప్పాలి. అయితే, దేశీయంగా మాత్రం ‘కాంతార చాప్టర్ 1’ బ్లాక్‌బస్టర్ రేంజిని సాధించింది. ప్రధానంగా ఒరిజినల్ కన్నడ వెర్షన్‌తో పాటు హిందీ వెర్షన్ దీనికి దన్నుగా నిలిచాయి. తెలుగు, ఇతర భాషల వెర్షన్లు కూడా బాగానే కలెక్షన్లు రాబడుతున్నాయి.

Also Read: https://teluguprabha.net/cinema-news/chiranjeevi-mana-shankara-vara-prasad-garu-first-single-meesala-pilla-song-response-and-views/

తాజా సమాచారం ప్రకారం దేశయంగా ఇప్పటివరకు ‘కాంతార చాప్టర్ 1’ మూవీ రూ. 465.9 కోట్ల నెట్ వసూలు చేసింది. అదే జీఎస్‌టీతో కలుపుకుంటే రూ. 549.76 కోట్లు. ఓవర్సీస్‌లో ఈ సినిమా రూ. 104 కోట్ల గ్రాస్ సాధించిందని అంచనా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన గ్రాస్ రూ. 653.76 కోట్లు.

‘ఛావా’ తర్వాత ప్లేస్‌లో…
రూ. 653.76 కోట్ల కలెక్షన్ సాధించడంతో 2025లో ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్ల మార్కును అందుకును రెండో భారతీయ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది ‘కాంతార చాప్టర్ 1’. ఆ ఫీట్‌ను మొదట సాధించిన సినిమా విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించిన ‘ఛావా’. ఆ మూవీ సాధించిన మొత్తం వసూళ్లు రూ. 827.06 కోట్లు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రజినీకాంత్ ‘కూలీ’, హృతిక్ రోషన్-ఎన్టీఆర్ మూవీ ‘వార్ 2’ రూ. 600 కోట్ల మైలురాయిని అందుకోవడంలో విఫలమయ్యాయి. కొత్త హీరో హీరోయిన్లు అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన లవ్ స్టోరీ ‘సయ్యారా’ (హిందీ) ప్రపంచవ్యాప్తంగా రూ. 570.67 కోట్ల కలెక్షన్‌తో మూడో స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad