Saturday, November 15, 2025
HomeTop StoriesRishab Shetty: బాక్సాఫీస్ రిపోర్ట్: 'ఛావా'కు చేరువవుతున్న 'కాంతార చాప్టర్ 1'

Rishab Shetty: బాక్సాఫీస్ రిపోర్ట్: ‘ఛావా’కు చేరువవుతున్న ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Box Office Collection: రిషబ్ శెట్టి హీరోగా నటించిన ‘కాంతారా చాప్టర్ 1’పై ఉన్న ఉత్కంఠ, థియేటర్లలో 16 రోజులు గడిచాక కొంచెం తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ఈ సినిమా కలెక్షన్ ప్రస్తుతం రూ. 493.75 కోట్లకు చేరింది. కానీ రోజువారీ సంఖ్యలు క్షీణించడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్‌నిల్క్ ప్రకారం, థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ 16వ రోజు రూ. 8.5 కోట్లు సాధించింది. ఇది ఇప్పటివరకు దాని రన్‌లో అతి తక్కువ కలెక్షన్. కానీ చాలా సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్ కంటే ఇంకా ఎక్కువే.

- Advertisement -

‘కాంతారా చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్త కలెక్షన్ ప్రస్తుతం రూ. 725 కోట్లు. ఇది సన్నీ దేవోల్ ‘గదర్ 2’ (రూ. 686 కోట్లు), సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ (రూ. 627 కోట్లు), రణ్‌బీర్ కపూర్ ‘సంజు’ (రూ. 588 కోట్లు), అలాగే ఈ ఏడాది రెండో అతిపెద్ద హిందీ బ్లాక్‌బస్టర్ ‘సైయారా’ (రూ. 570 కోట్లు) కలెక్షన్‌లను దాటింది. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, సినిమా కలెక్షన్ మరింత పెరగడం ఖాయం. అయితే, ‘కాంతారా చాప్టర్ 1’ ఇంకా సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ (రూ. 915 కోట్లు), లక్ష్మణ్ ఉటేకర్ ‘ఛావా’ (రూ. 807 కోట్లు), అట్లీ ‘జవాన్’ (రూ. 1160 కోట్లు) వంటి భారీ సినిమాల కంటే వెనకడుగులోనే ఉంది. ఈ లిస్టులో అది త్వరగా దాటగలిగే సమీప చిత్రం అమీర్ ఖాన్ ‘PK’ (రూ. 792 కోట్లు). ఆ తర్వాత ఈ ఏడాది టాప్ ఇండియన్ ఫిల్మ్ అయిన ‘ఛావా’పై అది గురిపెట్టనుంది.

‘కాంతారా చాప్టర్ 1’ ఆక్యుపెన్సీ రేట్లు కూడా క్రమంగా పడిపోతున్నాయి. కన్నడ థియేటర్లలో సగటు ఆక్యుపెన్సీ 23.51% ఉంది. తెలుగులో 17.06%, హిందీలో కేవలం 9.13%, తమిళంలో 28.09% ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఇంకా 5756 షోలు ఉన్నాయి. హిందీలో 3917 షోలు వేస్తుండగా, కన్నడలో 1099 షోలు ఉన్నాయి.

రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందు అత్యంత యాంటిసిపేటెడ్ సినిమా పేరు తెచ్చుకుంది, ముఖ్యంగా ఒరిజినల్ ఫిల్మ్ విజయం తర్వాత. మొదటి సినిమాకంటే చాలా పెద్ద బడ్జెట్‌తో వచ్చిన ఈ సీక్వెల్, నిర్మాణ కాలంలో వివాదాలకు తావిచ్చినా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సంపాదించింది. రిషబ్ శెట్టితో పాటు ఈ మూవీలో రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారి, ప్రమోద్ శెట్టి కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad