Kantara Chapter 1: పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తోన్న ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవటంలో బిజీగా ఉంది. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా కేరళలో ఈ చిత్రాన్ని విడుదల చేయనివ్వమని ఎగ్జిబిటర్స్ యూనియన్ ప్రకటించటం గమనార్హం.
కేరళలో ‘కాంతార చాప్టర్ 1’ విడుదలను నిలిపివేయడానికి ప్రధాన కారణం పంపిణీదారులతో లాభాల వాటాపై డీల్ కుదరకపోవడమే. ఈ సినిమాను కేరళలో విడుదల చేస్తోన్న నటుడు, నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్‌తో లాభాల వాటాపై డీల్ కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిటర్స్ యూనియన్ పేర్కొంది. సినిమా విడుదలైన మొదటి రెండు వారాలకు లాభాల్లో 55 శాతం వాటా ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ఈ డిమాండ్‌ను నిరాకరించింది. దీంతో కేరళలో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు యూనియన్ నిర్ణయం తీసుకుంది.
Also Read – Mega DSC 2025: త్వరలో మెగా డీఎస్సీ తుది జాబితా.. నియామక పత్రాలు ఎప్పుడంటే?
ఈ విషయంపై ఎగ్జిబిటర్ల యూనియన్ అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ ‘మలయాళ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో విడుదలైనప్పుడు కేవలం 40 శాతం లాభాల వాటాను మాత్రమే పొందుతున్నామ’ని పేర్కొన్నారు. మలయాళ చిత్ర నిర్మాతలకు అంత వాటా రానప్పుడు.. ఈ పంపిణీదారులు ఎందుకు అంత మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వారి నుంచి ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోమని ఎగ్జిబిటర్ల యూనియన్ స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో ‘కాంతార చాప్టర్ 1’ వీక్షించాలనుకున్న మలయాళీ ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. ‘కాంతార’ మూవీతో పాన్ ఇండియావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రుక్మిణి వసంత్, జయరామ్, రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ‘కాంతార’ సెన్సేషన్ తర్వాత ఈ ప్రీక్వెల్ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడు… ఎలా పరిష్కారమవుతుందో వేచి చూడాలి.
కాంతార (Kantara) సినిమా మీడియం బడ్జెట్‌లో చేస్తే పాన్ ఇండియా రేంజ్‌లో రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో హోంబలే ఫిలిమ్స్ ఈ ప్రీక్వెల్‌ను వంద కోట్లకు పైగానే ఖర్చు చేసి రూపొందించారు. మరి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఈసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Also Read – Chiru-Puri: ఫ్రేమ్ అదిరిపోయింది.


