Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’కు ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే?

Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’కు ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే?

Kantara Chapter 1 Updates: పాన్ ఇండియా లెవల్‌లో సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ మూవీతో హీరో రిషబ్ శెట్టి కూడా పాన్ ఇండియా వైడ్‌గా మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. బాహుబలి సీక్వెల్స్ తర్వాత మన సౌత్ సినిమా ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా వస్తున్నది పాన్ ఇండియా సినిమాలే. అన్నిటికంటే చిన్న చిత్ర పరిశ్రమగా చెప్పుకునే కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు మిగతా భాషలతోనూ పోటీ పడుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ ఇండస్ట్రీ నుంచే ఇప్పుడు ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు తయారవుతున్నాయి.

- Advertisement -

యష్, రిషబ్ లాంటి వారికి కన్నడలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ పాపులారిటీ వచ్చింది అంటే వాళ్ళు నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే. ఇక కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న కాంతార చాప్టర్ 1పై మొదట్నుంచి అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Also Read- Akhanda 2 OTT Rights: అఖండ 2 సరికొత్త రికార్డ్.. ఓటీటీ రైట్స్ ఎంతంటే!

కాంతార చాప్టర్ 1 ఈ అక్టోబర్ 2వ తేదీన వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మేకర్స్ నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ఇప్పటికే మన తెలుగు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. కాంతార తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంతార 1 మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ప్రాంతానికి వేర్వేరు డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అవడం ఆసక్తికరం.

ఇక ఉత్తరాంధ్రలో కాంతార చాప్టర్ 1ని విఘ్నేశ్వరా (వారాహి చలనచిత్రం ద్వారా), ఈస్ట్-వెస్ట్ గోదావరిలో గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే, గుంటూరులో వారాహి చలన చిత్రం, కృష్ణా జిల్లాలో కెఎస్‌ఎన్ టెలి ఫిల్మ్, నెల్లూరులో ఎస్‌వి సినిమాస్ రిలీజ్ చేస్తుండగా, సీడెడ్‌లో వారాహితో కలిసి శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేయబోతోంది. నైజాం ఏరియాలో ‘మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్’ రిలీజ్ చేస్తున్నారు. దీంతో కాంతార చాప్టర్ 1 రిలీజ్ కి స్క్రీన్ల సంఖ్య భారీ స్థాయిలో ఉండబోతున్నాయని ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Also Read- OG Records: OG మేనియా..ఇదేం అభిమానం.. ఆ రికార్డ్‌పై క‌న్నేసిన ప‌వ‌న్ ఫ్యాన్స్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad