Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభOTT Movies: ఈరోజు ఓటీటీలోకి భారీ హిట్స్ 'కాంతార: చాప్టర్ 1', 'కొత్త లోక'

OTT Movies: ఈరోజు ఓటీటీలోకి భారీ హిట్స్ ‘కాంతార: చాప్టర్ 1’, ‘కొత్త లోక’

Streaming: ఈ రోజు రెండు పెద్ద సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఒకటి ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన కన్నడ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’, మరొకటి మలయాళంలో పెద్ద విజయం సాధించి, తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ ఫాంటసీ మూవీ.

- Advertisement -

1. ‘కాంతార చాప్టర్ 1’

రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమా, 2022లో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్. ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమా (తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం) స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లలో పెద్ద సంచలనం సృష్టించింది. వరల్డ్‌వైడ్ ఈ సినిమా ఏకంగా 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, 2025లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇంత పెద్ద కలెక్షన్లు వచ్చినా, థియేటర్లలో విడుదలై కేవలం నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘కాంతార: చాప్టర్ 1’ ఇంత పెద్ద హిట్ అవ్వడంతో, ఇకపై ఈ సినిమాకు సంబంధించిన యూనివర్స్‌ను కొనసాగిస్తారని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ‘చాప్టర్ 1’ తరువాత, ‘కాంతార’ సినిమాకు సీక్వెల్ చాప్టర్ 2 రాబోతుంది. అంటే, ఈ కథ మొత్తం ఒక పెద్ద సిరీస్‌గా కొనసాగనుంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/baahubali-the-epic-review-telugu/

2. కొత్త లోకం చాప్టర్ 1

హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్రలో నటించిన మలయాళ ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ. తెలుగులో దీనిని ‘కొత్త లోక’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా కూడా ఈ రోజు జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో ఈ సినిమా భారీ విజయం సాధించింది. వరల్డ్‌వైడ్‌గా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. కేవలం ౩౦ కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్ లు సాధించడం నిజంగా మలయాళ ఇండస్ట్రీ లో ఒక రికార్డు అనే చెప్పాలి. తెలుగులో ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చింది. కలెక్షన్లు కూడా భారీగా లేకపోయినా, కథలోని కొత్తదనం వల్ల మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ డొమినిక్ అరుణ్ ఈ కథను మొత్తం 5 పార్టులుగా ప్లాన్ చేసినట్లు ప్రకటించాడు. రాబోయే చాప్టర్లలో హీరోలు దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ వంటివారు కూడా డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ సక్సెస్ వల్ల పార్ట్ 2 పనులు ఆల్రెడీ స్టార్ అయ్యిపోయాయి.

మొత్తానికి అన్ని ఇండస్ట్రీ లు ఇప్పుడు చాప్టర్ల ఫార్ములా ఫాలో అవుతూ
పెద్ద సక్సెస్ లని అందుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad