Rukmini Vasanth: ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతుంది రుక్మిణి వసంత్. బీర్బల్ అనే చిన్న సినిమాతో కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ శాండల్‌వుడ్‌లో నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది. కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకున్నది. కన్నడంలో టాక్సిక్ మూవీలో కేజీఎఫ్ హీరో యశ్‌తో రొమాన్స్ చేస్తుంది.
ఒక్క రోజు గ్యాప్‌లో…
కాగా ఈ వారం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో కాంతార చాప్టర్ వన్ థియేటర్లలో రిలీజ్ అవుతుండగా… మదరాసి ఓటీటీలోకి వస్తుంది.
యువరాణిగా…
కాంతార చాప్టర్ వన్ మూవీ అక్టోబర్ 2న ఐదు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీలో కనకావతి అనే క్యారెక్టర్‌లో రుక్మిణి వసంత్ కనిపించబోతున్నది. యువరాణిగా గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంది. కన్నడంలో రుక్మిణి వసంత్ నటిస్తున్న ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఇదే కావడం గమనార్హం. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాంతార చాప్టర్ వన్ కోసం రుక్మిణి వసంత్ రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు కన్నడ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ఫస్ట్ పాన్ ఇండియన్ హిట్టు అందుకోవాలని ఆశపడుతోంది రుక్మిణి వసంత్. కాంతార చాప్టర్ వన్ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా నటించాడు.ఈ సినిమాకు దర్శకుడు కూడా అతడే కావడం గమనార్హం.
మదరాసిలో…
కాంతార చాప్టర్ వన్ కంటే ఒక రోజు ముందు రుక్మిణి వసంత్ హీరోయిన్ నటించిన తమిళ మూవీ మదరాసి ఓటీటీలో రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై ఐదు రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. మదరాసి సినిమాకు కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో వంద కోట్ల లోపే వసూళ్లను దక్కించుకున్నది. నిర్మాతలకు నస్టాలను తెచ్చిపెట్టింది. మదరాసిలో మాలతి అనే మోడ్రన్ గర్ల్‌గా కనిపించింది. ఈ సినిమాలో శివకార్తికేయన్‌తో రుక్మిణి వసంత్ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి.
కాగా ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ సెట్స్‌లో రుక్మిణి వసంత్ నవంబర్‌లో అడుగుపెట్టబోతుంది. వచ్చే నెలలో మొదలయ్యే షెడ్యూల్‌లో ఎన్టీఆర్, రుక్మిణి వసంత్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.


