Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRishab Shetty: 'కాంతార చాప్టర్ 1' నంబర్ వన్‌గా నిలవాలంటే.. రావాల్సిన కలెక్షన్ ఇదే!

Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ నంబర్ వన్‌గా నిలవాలంటే.. రావాల్సిన కలెక్షన్ ఇదే!

2025 బాక్సాఫీస్ కలెక్షన్స్‌లో ‘ఛావా’కి, ‘కాంతార చాప్టర్ 1’కి మధ్య దూరమెంత..? ప్రస్తుతం ఇదే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చింది ‘కాంతార ఛాప్టర్ 1’. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటించగా, కీలక పాత్రల్లో జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారి, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -

అయితే, తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌కి సంబంధించిన న్యూస్ ఒకటి నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కాంతారా చాప్టర్ 1’ థియేటర్లలోకి వచ్చినప్పటి నుండి ప్రతిరోజూ ఓ కొత్త మైల్ స్టోన్‌ని దాటి వస్తోంది. ఇలా, రిలీజైన 24 రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 793.75 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల మార్కు వైపు దూసుకెళుతోంది.

‘కాంతార ఛాప్టర్ 1’తో రిషబ్ శెట్టి.. ‘ఛావా’ మూవీ రికార్డ్స్‌ని బ్రేక్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ‘ఛావా’ ఇప్పటికే, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా రికార్డ్‌ని రిషబ్ తన ‘కాంతార ఛాప్టర్ 1’ కలెక్షన్స్‌తో బ్రేక్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతానికైతే, ‘ఛావా’ రూ. 827.06 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో నంబర్ 1 స్థానంలో ఉంది.

Also Read: https://teluguprabha.net/cinema-news/rishab-shetty-makeup-transformation-for-kantara/

అయితే, 2025 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచిన ‘ఛావా’ను దాటి, నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని, రికార్డు నెలకొల్పడానికి ‘కాంతార చాప్టర్ 1’ ఇంకా రూ. 33.31 కోట్ల దూరంలో ఉంది.

ఈ ఏడాది ఇప్పటి వరకు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ ని గనక పరిశీలిస్తే..

ఛావా: 827.06 కోట్లు
కాంతార చాప్టర్ 1: 793.75 కోట్లు (24 రోజుల తర్వాత)
సయ్యారా: 570.67 కోట్లు
కూలీ: 516.93 కోట్లు
వార్ 2: 371.26 కోట్లు వసూళ్ళను రాబట్టాయి.

రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ 1000 కోట్లు సాధిస్తుందా?

ప్రస్తుతం, రిషబ్ శెట్టి ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల మార్కును చేరుకోవడానికి ఇంకా, రూ. 8 కోట్ల మార్క్ దగ్గర్లో ఉన్నాడు. అయితే, ‘కాంతార చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు సాధించగలిగితే అది ఒక అద్భుతం అవుతుంది. ఇంకా, ఈ మూవీపై ప్రేక్షకుల్లో బజ్ తగ్గలేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్స్ హౌస్‌ఫుల్‌గా షోలు ప్రదర్శితమవుతున్నాయి. చూడాలి మరి, ఏం జరుగుతుందో.

Also Read: https://teluguprabha.net/cinema-news/baahubali-the-epci-prabhas-new-look-goes-viral/

‘కాంతార చాప్టర్ 1’ కి, 23 రోజుల తర్వాత వసూళ్ళు పరిశీలిస్తే..

ఇండియా వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్: 579.2 కోట్లు
ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్: 683.45 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్: 110.3 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్: 793.75 కోట్లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad