Kantara : ఇటీవల కాలంలో కన్నడ పరిశ్రమ నుంచి సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి భారీ విజయాలు సాధిస్తున్నాయి. కన్నడ పరిశ్రమ నుంచి రిషబ్ శెట్టి హీరోగా, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతార. చిన్న సినిమాగా కన్నడలో రిలీజ్ అయి హిట్ కొట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజయి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఇప్పటికే కాంతార సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
రివెంజ్, దైవం, అక్కడి స్థానిక కళాకారుల సబ్జెక్టుతో వచ్చిన కాంతార సినిమా దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది. సినిమా రిలీజ్ అయి 50 రోజులు దాటుతున్నా ఇంకా థియేటర్స్ లో కాసులు కురిపిస్తుంది ఈ సినిమా. తాజాగా కాంతార సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 24 నుంచి కాంతార సినిమా స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు. దీంతో థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాని ఓటీటీలో చూడటానికి రెడీ అయిపోయారు. ఆల్రెడీ థియేటర్లో చూసిన వాళ్ళు మరోసారి ఓటీటీలో చూస్తామంటున్నారు. థియేటర్లలో రికార్డులు క్రియేట్ చేసిన కాంతార ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.