Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభIbrahim Ali Khan: సైఫ్ కుమారుడిని లాంఛ్ చేయనున్న కరణ్ జోహార్

Ibrahim Ali Khan: సైఫ్ కుమారుడిని లాంఛ్ చేయనున్న కరణ్ జోహార్

ఇటీవల సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికిత్స అనంతరం ఇంట్లోనే సైఫ్ విశ్రాంతి తీసుకుఎంటున్నారు. తాజాగా సైఫ్ మొదటి కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్‌(Ibrahim Ali Khan) బాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేంట్రం చేయనున్నారు. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్(Karan Johar).. ఇబ్రహీం అలీ ఖాన్‌ని హీరోగా పరిచయం చేయనున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీల వారసులను కరణ్ జోహార్ లాంఛ్ చేయగా.. ఇప్పుడు ఇబ్రహీం వంతు వచ్చింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా కరణ్ ప్రకటించాడు.

- Advertisement -

“నేను అమృత గారిని 12 ఏళ్ళ వయసులో కలిశాను. అప్పుడు ఆమె మా నిర్మాణ సంస్థలో సినిమా చేస్తున్నారు. నేను ఆమెతో మొదటిసారి కలిసి కూర్చొని తిన్న సంగతి నాకు గుర్తుంది. ఆమె నన్ను రెండో కొడుకుగా ట్రీట్ చేసింది. ఇక సైఫ్‌ని తొలిసారి ఆనంద్ మహేంద్ర ఆఫీస్‌లో కలిశాను. అందంగా, చార్మింగ్ యువకుడిగా ఉన్నాడు. ఇప్పుడు తొలిసారి ఇబ్రహీంని కలిసినప్పుడు అలాగే అనిపించింది. ఈ కుటుంబం నాకు 40 ఏళ్లుగా తెలుసు. వారితో కలిసి ఎన్నో సినిమాలకు పనిచేశాను. సినిమాలు వాళ్ళ రక్తంలోనే ఉన్నాయి. వారి కుటుంబం నుంచి ఇబ్రహీం త్వరలో వెండితెరపైకి రాబోతున్నాడు” అంటూ తెలిపాడు. కాగా సైఫ్ తొలి భార్య అమృతా సింగ్‌కు ఇబ్రహీం, సారా పిల్లలు. ఇప్పటికే సారా అలీ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి సైప్ వారసత్వాన్ని ఇబ్రహీం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాడో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad