Saturday, January 18, 2025
Homeచిత్ర ప్రభKarthika Deepam January 18th Episode: దాసు కోసం పోలీసులకు కంప్లైయింట్ ఇచ్చిన కాశీ.. జోత్స్న...

Karthika Deepam January 18th Episode: దాసు కోసం పోలీసులకు కంప్లైయింట్ ఇచ్చిన కాశీ.. జోత్స్న పని అయిపోయింది..

ఈరోజు ఎపిసోడ్‌లో కార్తిక్, కాశీతో శౌర్యకు ఆరోగ్యం బాలేదని చెప్తాడు. అప్పుడు కాశీ అందరినీ డబ్బు అడుగుతున్నావు నన్ను ఎందుకు అడగలేదు అని అడుగుతాడు. ఎవరి పరిస్థితి ఎలా ఉందో తెలిసి కుడా ఎలా అడుగుతాను అని కార్తిక్ అంటాడు. దానికి కాశీ నువ్వు మంచోడివి అందుకే నీకే కష్టాలు వస్తున్నాయి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా ఇల్లు తర్వాత కట్టుకుంటాను అంటాడు. దానికి కార్తిక్ బాధతో తీసుకుంటాను కానీ అప్పుగానే కానీ దీపకి చెప్పవద్దు అని అంటాడు. కాశీ ఏమో నేను చెప్పకుండా ఉండలేను అంటాడు అయితే నీ దగ్గర తీసుకోను నీ దగ్గర అంటాడు కార్తిక్. ఇదివరకూ రూ.50 లక్షలు అంటే ఒక నంబర్ ఇప్పుడు అదే డబ్బు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నేను ఒడిపోను ఎలా అయినా ఏదోలా డబ్బు అరేంజ్ చేస్తాను అంటాడు.

- Advertisement -

అదంతా అయ్యాక నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగితే నాన్నను వెతుకున్నాను కనిపించట్లేదు రెండు రోజుల నుంచి అంటాడు కాశీ. ఏమి జరిగిందో తెలియట్లేదు అని కాశీ కంగారు పడతాడు. అక్కడ దాసుకి ఏమైంది అని జోత్స్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ మాటలు పారిజాతం విని నా కొడుకుని ఏమి చేసావు అని అడుగుతుంది. దాసు కనపడకపోతే నాకు ఏంటి సంబంధం అని అంటుంది జోత్స్న. వాళ్లిద్దరి మాటలను దశరథ చాటుగా ఉండి వింటాడు. నేను అన్నీ చూస్తునే ఉన్నా ఏమైంది చెప్పు అంటుంది పారిజాతం. దశరథకు అనుమానం వచ్చి అన్నీ ఆలోచిస్తాడు. నిజం తెలియాలంటే దాసు స్పృహలోకి రావాలి అని అనుకుంటాడు. నిజాలు బయటపడుతాదనే కదా చంపాలని చూసా అని జోత్స్న మనసులో అనుకుంటుంది.

మరోవైపు కార్తిక్ దీప రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో రౌడీలు ఒక బాబును ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. వాళ్లని కొట్టి దీప ఆ బాబును కాపాడుతుంది. అప్పుడు ఆ బాబు తండ్రి దీప కాపాడినందుకు థాంక్స్ చెప్తాడు. అక్కడ జోత్స్న ఇంట్లోకి కాశీ వస్తే శివన్నారయణ ఇంట్లోకి రానీయకుండా ఆపేస్తాడు. ఎందుకొచ్చావు అంటే నాన్నమ్మతో మాట్లాడాలి అంటాడు. నాన్న కనపడట్లేదు అని చెప్తాడు, ఇంట్లో అందరూ షాక్ అవుతారు. దశరథ ఏమో కనిపించకపోవడం కాదు ఈ జోత్స్న కొట్టి రోడ్డు పక్కన పాడేసింది అని మనసులో అనుకుంటాడు. ఏదో జరిగి ఉంటుంది నాకు భయంగా ఉంది అని పారిజాతం కంగారు పడుతుంది. జోత్స్న దశరథ మాటలకు కంగారు పడుతుంది. మీ నాన్న సంగతి అందరికీ తెలిసిందే ఎక్కడుంటాడో ఆతనికే తెలియదు అని జోత్స్న అంటే నీకు తెలుసా అని దశరథ అంటాడు. అన్నీ తెలిసినట్టు మాట్లాడకు అని పారిజాతం అంటుంది.దాసుని నిన్న గాని మొన్న గాని చూసావా అని అడుగుతాడు. శివన్నారయణ మీ నాన్న గురించి మాకు తెలియదు ఏమి చేసుకుంటావో చేసుకో అని శివన్నారయణ అంటాడు. నాన్నకు దాసు హాస్పిటల్‌లో ఉంచిన విషయం తెలియకూడదు అని ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ చేయగలను అని ఆలోచిస్తాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News