ఈ రోజు ఎపిసోడ్‌లో జోత్స్న దాసుని హాస్పిటల్‌లో ఎవరు జాయిన్ చేశారో తెలుసుకోవాలి లేదంటే పోలీసులు డైరెక్ట్‌గా నా దగ్గరకే వస్తారు అని అనుకుంటుంది. ఇంతలో పోలీసులు ఇంటికి వస్తారు. జోత్స్న కంగారు పడుతుంది. పోలీసులు జోత్స్నను దాసు గురించి మీతో మాట్లాడడానికి అంటారు. దాసు మీకు ఏమవుతారు అంటే నా కొడుకే అంటుంది పారిజాతం. మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటే కాశి వాళ్ళ నాన్న కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు ఆయన హాస్పిటల్‌లో ఉన్నారు వాళ్లకి అప్పచెప్పాము కానీ కేసు అలనే ఉంది ఇది అటెమ్ట్ టు మర్డర్ కేసు అందుకే విచారించడానికి వచ్చాము అంటారు. వాళ్ల ఇంట్లో వాళ్లు కుడా ఇది మర్డర్ అనుకుంటున్నారు అందుకే వెరిఫికేషన్ చేస్తున్నాము అంటారు. ఇన్‌వెస్టిగేషన్‌లో దాసు మొబైల్ లొకేషన్ చివరగా ఇక్కడే చూపిస్తోంది. అంటే మా ఇంటికి వస్తే నాకు తెలియకుండా ఉండదు అని పారిజాతం అంటుంది. జోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడు దశరథ జోత్స్న దొరికిపోయేలా ఉంది తనని కాపాడాలి అని మనసులో అనుకుంటాడు.
పోలీసులు ఇక్కడికి దాసు వచ్చారు అంటే అయితే మేమే కొట్టామా అని శివన్నారయణ అంటాడు. మా డ్యూటీ మమ్మళ్ని చేసుకోనివ్వండి అంటారు పోలీసులు. అయితే మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి చూసుకోండి అంటాడు ముసలోడు. జోత్స్న, దశరథ మాత్రం కంగారు పడతారు. మరొకవైపు దీప ఏడ్చుకుంటూ కార్తీక్ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటుంది. కార్తిక్ వచ్చి అప్పటినుంచి ఇక్కడే ఉన్నావా అంటే నా ప్రాణాన్ని తీసుకెళ్లిపోయారు ఆశతో వెనక్కి వస్తారేమో అని ఎదురుచూస్తున్నాను అంటుంది దీప. దానిని వదిలి దూరంగా ఉండటం ఇదే మొదటి సారి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. అక్కడ శౌర్య కూడా కార్తీక్ దీపల ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో శౌర్య దగ్గరికి కాశీ వస్తాడు. శౌర్యకు ఏమైనా జరిగితే నేను చచ్చినట్టే నేను జాగ్రత్తగా చూసుకుంటాను నవ్వు దైర్యంగా ఉండు అంటాడు.
అక్కడ పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ చూస్తుంటే మధ్యలో దశరథ జోక్యం చేసుకుని పోలీసులను తప్పు దారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే జోత్స్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేస్తుంది. ఎందుకు డిలీట్ అయిందని పోలీసులు అడిగితే సిస్టం పోయింది అందుకే రికార్డు అవ్వలేదు అంటుంది జోత్స్న. పోలీసులు సారీ చెప్పి వెళ్లిపోతారు. దశరథ ఏమో ఇన్‌డైరెక్ట్‌గా జోత్స్నకు థాంక్స్ చెప్తాడు. మరొక వైపు దీప ఇంట్లో అందరినీ భోజనం తినడానికి పిలుస్తూ అలవాటులో శౌర్యని కుడా రావే, అన్నం వేడిగా తినాలి రా అని అంటుంది. కార్తిక్ ఏమో శౌర్య ఇంట్లో లేదు కదా అంటే దీప ఏడుస్తుంది. అంత దూరం సైకిల్ మీద ఇప్పుడు వెళ్లలేము అంటారు.
సరే కనీసం ఫోన్ అయినా చేసి మాట్లాడించండి అంటే ఏదొక సాకులు చెప్పి తప్పించుకుంటాడు. కానీ అనసూయ, కాంచనకు అనుమానం వస్తుంది. అయినా దీప మాత్రం ఏడుస్తూ ఉంటుంది. నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే ఫోన్ ఇచ్చి ఇందులో వర్ష అని నెంబర్ ఉంది ఫోన్ చేసి నువ్వే కనుక్కో అంటాడు. దీప ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ మాత్రం ఇన్ని అబద్దాలు చెప్తున్నాను అని టెన్షన్ పడుతూ ఉంటాడు.