ఈరోజు ఎపిసోడ్‌లో దీప చేసిన టిఫిన్స్‌ను అందరూ తింటున్నారు. జోత్స్న ఈ టిఫిన్స్ ఎవరు చేసారు అన అడిగితే సుమిత్ర దీప చేసింది అని చెప్తుంది. కార్తిక్ టిఫిన్స్ సెంటర్ నుంచి తెప్పించాను అంటుంది. ముందే చెప్పాల్సిందే అని తినకుండా లేచి వెళ్లిపోతారు. దీపని సుమిత్ర పొగుడుతుందని దాసు తనతో ఏమైనా చెప్పాడా అని జోత్స్న సందేహంలో పడుతుంది. వేరే సీన్‌లో కార్తిక్‌ను, దీప పొద్దున్న మన షాప్ దగ్గరక సుమిత్ర అమ్మగారు వచ్చారు కదా ఎందుకు ఆడపడుచును కలవకుండా వెళ్లిపోయారు అని అడుగుతుంది. మోహం చూపించలేక బాధతో వెళ్లిపోయింది అని కార్తిక్ చెప్తాడు. సొంత మనుషుల మధ్య దూరాలు ఇలా పెరిగిపోతున్నాయి అని ఇద్దరూ బాధ పడుతారు. మీరందరూ మళ్లీ కలవాలి, అందుకు మీరు గెలవాలి అంటుంది దీప. ఉదయాన్నే టిఫిన్ సెంటర్ మొదలుపెడుతారు. అప్పుడు అక్కడికి ఫుడ్ కార్పొరేషన్ నుంచి వచ్చాం మీ మీద కంప్లైయింట్ వచ్చింది అంటూ కొంతమంది వస్తారు. ఇక్కడ కార్తిక్ మీరేనా అని అడుగుతారు. మీ షాప్‌ను ఆపండి మేము చెక్ చేయాలి అంటాడు. మేము చెప్పేంతవరకూ మీరు అమ్మడానికి వీలు లేదు అంటాడు.
ఫిర్యాదు చేసిన వాళ్లు ఎవరు అని అడిగితే చెప్పకుండా మేము చెప్పకూడదు. మా పని మమ్మళ్ని చేయనివ్వండి అంటాడు. వెనక నుంచి జోత్స్న అంతా చూస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్లు అంతా చెక్ చేస్తూ ఉంటారు. మధ్యలో దీప టిఫిన్ రోజూ తినే బాబాయ్ వచ్చి ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పకపోతే మీ సుపీరియర్‌కి ఫోన్ చేసి నేను అడుగుతాను అంటాడు. వాళ్లు బయపడి ఎవరో తెలియని వ్యక్తి ఇచ్చారు అని చెప్తాడు. అప్పుడు కార్తికి, దీప కి సారీ చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతారు. అందరూ టిఫిన్ తింటారు. ఇంక జోత్స్న ప్లాన్ పాడవుతుంది. ఇది చేసింది జోత్స్న నా అని కార్తిక్ అనుకుంటాడు. దీపని ఎలా అయినా దెబ్బకొట్టాలి అని ప్లాన్‌లు వేసుకుంటుంది.
అక్కడ కార్తిక్ వాళ్లు భోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడే ఎవరో వచ్చారు అని తలుపు తీస్తే ఆఫీస్ నుంచి మేనజర్ వాళ్లు వస్తారు. ఏమైంది ఈ టైంలో వచ్చారు అని అడిగితే కంపెనీలో జీతాలు ఇవ్వలేక పోతున్నారని 50 ఏళ్లు దాటిన వాళ్లని సీఈఓ తీసేసారు అని కార్తిక్‌కు చెప్తాడు. లిస్ట్ ప్రిపేర్ చేసిన మేనేజర్‌తో సహా అందరినీ తీసేసారు అని చెప్తారు. మీరే మమ్మళ్ని కాపాడాలి మా జీవితాలు నాశనం అవుతాయి అని బ్రతిమాలుతారు. కార్తిక్ సాల్వ్ చేస్తానని మాట ఇస్తాడు. జోత్స్న ఇలా ఎందుకు చేస్తుందని కార్తిక్ వాళ్ల అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.