Thursday, January 9, 2025
Homeచిత్ర ప్రభKarthika Deepam January 9th Episode: ఈరోజు జోత్స్న పని అవుటౌ.. శివన్నారాయణ ఉగ్రరూపం, కార్తిక్...

Karthika Deepam January 9th Episode: ఈరోజు జోత్స్న పని అవుటౌ.. శివన్నారాయణ ఉగ్రరూపం, కార్తిక్ గెలుస్తాడా

ఈరోజు ఎపిసోడ్‌లో ఊరు వెళ్లిన అనసూయ తిరిగి వస్తుంది. అక్కడ జరిగిన విషయాలు అన్ని కాంచనతో చెప్తుంది. అలా సౌర్యతో కలిసి ముగ్గురూ మాట్లాడుకుంటారు. కార్తీక్, దీప కనిపించట్లేదు ఏంటి అనసూయ అడుగుంతి. అప్పుడు కాంచన ఆఫీస్‌లో జరిగినదంతా చెప్తుంది. దీప, కార్తీక్ ఎంప్లాయిస్‌తో కలిసి ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉంటారు. బయట నినాదాలు చేస్తుంటే ఆ అరుపులకు జోత్స్న మేనేజర్‌ని పిలిచి అడగగా, జాబ్‌లో నుంచి తీసేసినందుకు ధర్నా చేస్తున్నారు అని చెప్తాడు.

- Advertisement -

జోత్స్న బయటికి వెళ్లి అక్కడ కార్తీక్, దీపలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి బావ మాజీ ఎంప్లాయి‌స్‌తో వచ్చి దర్నా చేస్తున్నావు. పగ తీర్చుకోవాలని చూస్తున్నావా అంటుంది. న్యాయం చేసి తిరిగి ఉద్యోగాలు ఇప్పింటడానికి వచ్చాను అంటాడు కార్తీక్. అయినా పగలు ప్రతీకారాలు గురించి నువ్వ మాట్లాడుతున్నావా అని దీప అంటుంటే నువ్వు మధ్యలో మాట్లాడకు అంటుంది జోత్స్న. మా టిఫిన్ సెంటర్ దగ్గరికి ఎవరిని పంపించావో మాకు తెలియదా అంటే జోత్స్న కంగారు పడుతుంది. ఆధారాలు ఉంటే కేసులు పెట్టుకోండి అంటుంది.

అయినా నువ్వు ఎందుకు ఉద్యోగులను తీసేసావు అని నిలదీస్తే నా ఇష్టం అంటుంది. కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి అని గట్టిగా నిలదీస్తాడు. తిరిగి ఉద్యోగంలో తీసుకోకపోతే ఎంత దూరం అయినా వెళ్తాము అంటాడు కార్తిక్. ఏమి చేసుకుంటారో నేను మాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటుంది జోత్స్న. కంపెనీ లీగల్ అడ్వైజర్ జోత్స్న వాళ్ల నాన్నకు కాల్ చేసి జరిగింది చెప్తాడు. అప్పుడు దశరథ అంతా శివన్నారయణకు చెప్తాడు. దానితో ఇంట్లో అంతా షాక్ అవుతారు. అయితే ఉదయం కార్తీక్ ఇంటికి వచ్చింది ఈ విషయం చెప్పడానికే వచ్చాడు అని ద శరథ అంటాడు.

Image Credits: Disney +hotstar

ఇంతలో ఇంటికి వచ్చిన జోత్స్న ఏం జరిగింది అని అడుగుతుంది. వెంటనే శివన్నారాయణ నోరు మూసుకో అని గట్టిగా అరుస్తాడు. ఇప్పటి ఆ కంపెనీని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను, దానిని రోడ్డు మీదకు తెచ్చే పరిస్థితి తెస్తే మనవరాలు అని చూడను అంటాడు. దీనికి ముందే చెప్పాను వెంటే సరే గా అనుకుంటుంది పారిజాతం.

నిన్ను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొట్టలేదు కొట్టేలా చేసుకోకు వెంటనే అక్కడికి వెళ్లి వాళ్లందరికీ సారీ చెప్పు పదా అని గట్టిగా చెప్తాడు దశరథ. నేను ఎవరికీ సారీ చెప్పను అని జోష్న అంటుంది. వెంటనే పద అని తీసుకెళ్తాడు. మరోవైపు స్వప్న కాశీ, దాసుల దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్తుంది. దాసు కోపంతో మీరు కాదు నేను వెళ్లి తనకి బుద్ధి చెప్తాను అని ఆవేశంతో ఊగిపోతాడు. మధ్యలో నువ్వు ఎవరు చెప్పడానికి నీ మాట వింటుందా నువ్వు అంటేనే ఆ జోత్స్నకు నచ్చదు అంటాడు కాశీ. తనే నా కూతురు అని చెప్పబోయి ఆగిపోతాడు.

Image Credits: Disney + Hotstar

ఈలోపు కంపెనీకి దశరథ జోత్స్న వస్తారు. దశరథ జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నాను అనడంతో క్షమాపణలు కాదు మావయ్య ఇలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు అంటాడు కార్తిక్. ఉన్నపలంగా జాబ్ లోంచి తీసేస్తే వీళ్ళ బతుకులు ఏమైపోతాయి అంటూ ఎంప్లాయిస్ తరఫున కార్తీక్ మాట్లాడుతాడు. జోత్స్న కుడా అందరికీ సారీ చెప్తుంది. అప్పుడు దశరథ ఎప్పటిలాగే మీరు మీ పనులు చేసుకోండి అంటాడు. దాంతో అందరూ సంతోషపడుతూ కార్తీక్‌ని పొగుడుతూ జై జై లు కొడతారు. మీ వల్లే మాకు న్యాయం జరిగింది ఇలాంటి భార్య దొరకడం మీ అదృష్టం అని అందరూ అంటుంటే, ఆ మాట మళ్లీ గట్టిగా చెప్పండి అని జోత్స్నకు వినిపిస్తాడు. దానికి జోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News