Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభSree Leela: మరోసారి హాట్ టాపిక్ గా శ్రీలీల ప్రేమాయణం

Sree Leela: మరోసారి హాట్ టాపిక్ గా శ్రీలీల ప్రేమాయణం

SreeLeela-Karthik Aryan: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ శ్రీలీల మధ్య అనుబంధం ఉందనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ సమయంలో మొదలైన ఈ స్నేహం ఇప్పుడు మరింతగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ఒక సంఘటన ఈ ఊహాగానాలకు కొత్త ఊపు తీసుకొచ్చింది.

- Advertisement -

గణేశ్ చతుర్థి ఉత్సవాలు..

ముంబైలోని కార్తీక్ ఆర్యన్ ఇంట్లో గణేశ్ చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు శ్రీలీల తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఇరు కుటుంబాలు కలిసి పండుగను జరుపుకోవడం బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. సాధారణంగా స్టార్ హీరోల వేడుకలకు సినీ స్నేహితులు హాజరుకావడం కొత్త విషయం కాదు. కానీ, కుటుంబ సభ్యులతో కలిసి రావడం ప్రత్యేకంగా కనిపిస్తోంది.

స్నేహం కంటే ఎక్కువ..

కార్తీక్, శ్రీలీల ఇద్దరూ ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ ఆరంభమైనప్పటి నుంచి వీరి మధ్య స్నేహం కంటే ఎక్కువ ఉన్నట్టుగా అనేక రూమర్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కార్తీక్ ఇంట్లో జరిగిన పండుగకు శ్రీలీల కుటుంబం వెళ్లడం ఈ చర్చలకు మరింత బలం ఇచ్చింది.

సోషల్ మీడియాలో..

ఈ వేడుకలో కార్తీక్, శ్రీలీల ఇద్దరూ వారి ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో, అభిమానులు, నెటిజన్లు వీరి జంటపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఇరు కుటుంబాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సంబంధంపై మరింత ఆసక్తిని రేపుతోంది.

Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-og-bgm-with-117-musicians-and-japanese-instrument/

ఈ సంఘటనతోపాటు, కార్తీక్ తల్లి మాల తివారీ గతంలో చెప్పిన మాటలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. మార్చిలో జరిగిన ఐఫా అవార్డుల సందర్భంలో ఆమె తన కొడుకు భవిష్యత్ కోడలిపై అభిప్రాయం వెల్లడించారు. ఆమె కోరుకున్న కోడలు డాక్టర్ అయి ఉండాలని చెప్పింది. వృత్తిరీత్యా ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయిన శ్రీలీలను చూసి అభిమానులు, ఇదే కార్తీక్ తల్లి మనసులో ఉన్న కోడలు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం వారి మధ్య ఉన్న అనుబంధం గురించి స్పష్టమైన సమాధానం లేకపోయినా, కుటుంబాల కలయికతో ఊహాగానాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. వారి రాబోయే సినిమా షూటింగ్ ముగిసేలోపే ఈ రూమర్స్ మరింత పెద్ద చర్చలకు దారితీయవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad