Kartik Aaryan Next Movie: గత కొంతకాలంగా బాలీవుడ్ హీరోలు మన సౌత్ దర్శకుల మీద ఆధారపడుతున్నారు. దీనికి కారణం హిందీలో వస్తున్న సినిమాలు ఫ్లాపవుతూ అక్కడ హీరోలకి ఫ్లాప్స్ ఇస్తూ వస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. కానీ మన సౌత్ డైరెక్టర్స్ మాత్రం హిందీ హీరోలకి భారీ హిట్ ఇచ్చి అగాధంలో ఉన్న వాళ్ళని లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చుతున్నారు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తీసి సంచలనం సృష్ఠించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీ డైరెక్ట్ చేశాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ మూవీ హిందీలో సాలీడ్ హిట్ అందుకుంది.
అప్పటి వరకూ షాహిద్ కి హిందీలో ఉన్న రెమ్యునరేషన్ ని కబీర్ సింగ్ తర్వాత పెంచేశారు. ఇక, కియారా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సమయంలో.. ఈ సినిమా హిట్ మరో రేంజ్ కి తీసుకెళ్ళింది. అట్లీ తమిళంలో సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఆయనతో బాలీవుడ్ బాధ్షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీని చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవా హిందీలో సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలకి సూపర్ హిట్స్ ఇచ్చారు.
Also Read – Ys. Jagan : అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ షాక్
లోకేష్ కనగరాజ్ కూడా.. ఆమిర్ ఖాన్ తో ఓ సూపర్ హీరో సినిమాను చేయబోతున్నాడు. ఇటీవల లోకేష్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో ఆమిర్ ఓ గెస్ట్ రోల్ చేసి మేకింగ్ పరంగా ఇంప్రస్ అవడంతో హిందీలో లోకేష్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇదే క్రమంలో తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ కూడా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తాజా సమాచారం. కాకపోతే ఈ కాంబో కరెక్టేనా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన నటించిన పంజా సినిమా.
2011 లో పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణు వర్ధన్ పంజా సినిమాను తీశారు. ఈ సినిమాలో పవన్ మేకోవర్ చూసి ఇండస్ట్రీ రికార్డ్ అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. ఇక 2021 లో షేర్షా తీసి ఫ్లాపిచ్చిన విష్ణు వర్ధన్, ఆ తర్వాత తమిళంలో తీసిన సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది. ఇలాంటి దర్శకుడితో హిట్స్ అందుకుంటూ కెరీర్ మంచి ఊపు మీదుంటే అనవసరమైన రిస్క్ అవసరమా..? అంటూ కార్తీక్ ఆర్యన్ కి సన్నిహితులు సలహాలిస్తున్నారట. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో…ఈ కాంబో సెట్ అవుతుందో కాదో..
Also Read – Sridevi Property Controversy: శ్రీదేవి ఆస్తి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన బోనీ కపూర్


