త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న కత్రినా?. వైరలవుతోన్న బేబీ బంప్ పిక్స్..
బాలీవుడ్ అగ్రతార కత్రీనా కైఫ్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. బేబీ బంప్‌తో ఉన్న కత్రినా. మెరున్ కలర్ డ్రెస్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఈ చిత్రాల్లో ఉంది. అయితే ఇవి చూసిన అభిమానులు త్వరలోనే తమ ఫేవరెట్ హీరోయిన్ పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుందని తెగ సంబరపడిపోతున్నారు. కాగా ఈ చిత్రాలు నిజమైనవా లేక ఏదైనా మూవీ ప్రమోషన్లో భాగమా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటి వరకూ కత్రినా-విక్కీ కౌశల్ జంట సైతం అధికారిక ప్రకటన చేయలేదు. అదేవిధంగా ఖండిచనూలేదు.
కత్రీనా కైఫ్ కెరీర్
2003లో బూమ్ అనే చిత్రంతో కత్రీనా కైఫ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆనతి కాలంలోనే టాఫ్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ నటి నటించిన ఏక్ ద టైగర్, జబ్ తక్ హై జాన్, దూమ్-3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించి కత్రీనాను బాలీవుడ్ అగ్రతారలలో ఒకరిగా నిలిపాయి. 2023లో సల్మాన్ ఖాన్ తో నటించిన టైగర్-3 చిత్రం సైతం మంచి కలెక్షన్లను రాబట్టింది. కత్రీనాకు టాలీవుడ్‌తోనూ మంచి అనుబంధం ఉంది. 2004 విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరీ చిత్రంలో నటించింది. ఈ మూవీ మంచి మంచి కామెడీతో ప్రేక్షకులను అలరించింది. మరోవైపు, చివరిసారిగా కత్రినా కైఫ్ ‘మేరీ క్రిస్మస్’ సినిమాలో కనిపించింది.
Also Read:https://teluguprabha.net/cinema-news/prakash-raj-sarcastic-tweet-on-modi-goes-viral/
కత్రినా లవ్ ట్రాక్
కత్రినా కైఫ్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తో ప్రేమయాణం నడిపింది. 2021 డిసెంబర్లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో వీరి వివాహం జరిగింది. కత్రీనా భర్త విక్కీ కౌశల్ నటించిన ఛావా చిత్రం దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మారాటా యోధుడు శంభాజీ మహారాజ్ చరిత్ర నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దీంతో విక్కీ కౌశల్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. త్వరలో అతను రణబీర్ కపూర్, అలియా భట్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ సినిమా షూటింగ్‌లో పాల్గోనబోతున్నాడు.
కత్రినా ప్రెగ్నెన్సీ వైరల్
కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు జూలై 30న తొలిసారిగా ఊహాగానాలు మొదలయ్యాయి. ముంబైలోని ఒక ఫెర్రీ పోర్ట్ నుండి కత్రినా, విక్కీ కౌశల్ ఉన్న వీడియో ఒకటి వైరలయ్యింది. అందులో తన ఓవర్‌సైజ్డ్ వైట్ షర్ట్, బ్యాగీ ప్యాంట్‌తో కనిపించింది. దీంతో ఆమె గర్భవతి కావచ్చని అభిమానులు భావించారు. ఆ తర్వాత కొన్నికొన్ని నివేదికలలో కత్రీనా అక్టోబర్ లేదా నవంబర్‌లో తన మొదటి బిడ్డకు జన్మనిస్తుందని తెలిసింది. ఏదేమైనప్పటికీ కత్రినా బేబీబంఫ్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. తమ అభిమాన నటి త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.


