Katrina Kaif and Vicky Kaushal Net Worth: బాలీవుడ్‌లో అత్యంత అభిమానులను సంపాదించిన జంటల్లో కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పేర్లు ముందుంటాయి. ఈ స్టార్ దంపతులు త్వరలోనే తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారు. మంగళవారం సోషల్ మీడియా ద్వారా వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రకటించడంతో సినీ ప్రపంచంలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. అభిమానులు, స్నేహితులు, సహచర నటీనటులు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బాక్సాఫీస్ వద్ద..
వివాహం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించని కత్రీనా, చివరిసారిగా మెర్రీ క్రిస్మస్ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. మరోవైపు విక్కీ కౌశల్ మాత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రతిభను నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ఛావా చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 2025లో విడుదలైన ఈ సినిమా దాదాపు 800 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం విశేషం.
ఇప్పుడీ జంట వ్యక్తిగత జీవితంతో పాటు ఆస్తులు, ఆదాయ వనరులు, లగ్జరీ జీవనశైలిపై నెటిజన్స్ పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. నివేదికల ప్రకారం వీరిద్దరి కలిపిన ఆస్తుల విలువ రూ.265 కోట్లకు పైగానే ఉంది. అందులో విక్కీ కౌశల్ వద్ద సుమారు రూ.41 కోట్లు, కత్రీనా కైఫ్ వద్ద సుమారు రూ.224 కోట్ల ఆస్తులు ఉన్నాయని సమాచారం.
విక్కీ కౌశల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి మార్కెట్ కలిగిన నటుడు. ఒక్కో సినిమాలో ఆయన తీసుకునే పారితోషికం సుమారు రూ.10 కోట్లు వరకు ఉంటుంది. ఇటీవల డంకీ చిత్రంలో అతిథి పాత్రకు ఆయన రూ.12 కోట్ల వరకు పొందారని సమాచారం. నటనలోకి రాకముందు విక్కీ 2015లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణం మొదలు పెట్టడం విశేషం. తక్కువ సమయంలోనే ఆయన పెద్ద హీరోల సరసన నిలబడగలిగారు.
బాలీవుడ్‌లో అగ్రనటిగా..
కత్రీనా కైఫ్ విషయానికి వస్తే, ఆమె దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో అగ్రనటిగా కొనసాగుతున్నారు. పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరుగా గుర్తింపు పొందారు. ఆమె చివరగా నటించిన మెర్రీ క్రిస్మస్ చిత్రానికి సుమారు రూ.21 కోట్ల పారితోషికం అందుకున్నారని నివేదికలు చెబుతున్నాయి.
2021లో వీరిద్దరూ రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో అద్భుతమైన వేడుకల మధ్య వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి వీరిద్దరి జంట బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైంది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరి క్రేజ్ తగ్గలేదు. అభిమానులు ప్రతి చిన్న అప్‌డేట్‌ను ఆసక్తిగా గమనిస్తున్నారు.
లగ్జరీ లైఫ్‌స్టైల్‌లోనూ..
లగ్జరీ లైఫ్‌స్టైల్‌లోనూ ఈ జంట ముందుంటారు. వీరి వద్ద ఉన్న కార్ల జాబితా చూసినా అది స్పష్టంగా తెలుస్తుంది. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB, దీని ధర రూ.3.28 కోట్లు, రేంజ్ రోవర్ వోగ్ సుమారు రూ.2.32 కోట్లు, మెర్సిడెస్-బెంజ్ GLE రూ.1.15 కోట్లు, ఆడి Q7, BMW 5GT వంటి వాహనాలు వీరి గ్యారేజీలో ఉన్నాయి. ఈ లగ్జరీ కార్లతో వీరి జీవనశైలి ఎంత విలాసవంతంగా ఉందో అర్థం అవుతోంది.
లవివాహం తర్వాత వ్యక్తిగత, వృత్తి జీవితాలను సమానంగా కొనసాగిస్తున్న ఈ జంట ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యంత ధనవంతులైన దంపతుల జాబితాలో నిలిచారు. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ఈవెంట్స్ ద్వారా కూడా వీరిద్దరూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/hidden-meaning-of-spider-under-durga-forehead-dot/
కత్రీనా, విక్కీ జంటపై అభిమానుల మక్కువ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారి పెళ్లి వేడుక నుంచి ఇప్పటి వరకు ప్రతీ విషయంలోనూ వీరిద్దరూ మీడియా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా మారుతున్న విషయంతో మరోసారి ఈ జంట గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి.


