Katrina Kaif: బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ తల్లయ్యింది. శుక్రవారం (నేడు) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను సోషల్ మీడియా ద్వారా కత్రినాకైఫ్ భర్త, బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ వెల్లడించారు. ఎంతో ఆనందంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడు. మా జీవితంలో ఆనందం రెట్టింపు అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. విక్కీ కౌశల్ పోస్ట్ వైరల్ అవుతోంది.
తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ జంటకు బాలీవుడ్ సెలిబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కత్రినాకైఫ్‌కు కూతరు జన్మిస్తుందని అనిరుధ్ కుమార్ మిశ్రా అనే జ్యోతిష్యుడు ప్రకటించాడు. అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. అనిరుధ్ కుమార్ మిశ్రా చెప్పిన జ్యోతిష్యం చాలా సార్లు కరెక్ట్ కావడంతో కత్రినా కైఫ్‌కు నిజంగానే ఆడపిల్ల పుడుతుందని అందరూ అనుకున్నారు. కానీ మగబిడ్డ జన్మించడంతో అనిరుధ్ కుమార్ మిశ్రాను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు. అతడి జ్యోతిష్యాన్ని ట్రోల్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ పెడుతోన్నారు.
Also Read – Rakul Preet Singh: వైట్ డ్రెస్ లో రకుల్ మెరుపులు.. కుర్రకారు అరుపులు..
2021 డిసెంబర్‌లో విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ పెళ్లి జరిగింది. పెళ్లి కంటే ముందు ఈ జంట రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. చివరగా మెర్రీ క్రిస్మస్‌గా మూవీతో 2024 ప్రేక్షకుల ముందుకొచ్చింది కత్రినాకైఫ్. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మెర్రీ క్రిస్మస్ తర్వాత సినిమాలకు దూరమైంది కత్రినాకైఫ్.
మరోవైపు ఛావాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు విక్కీ కౌశల్. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ 800 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సెకండ్ మూవీగా నిలిచింది. ఛావా సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఛావా తర్వాత ప్రస్తుతం లవ్ అండ్ వార్ సినిమా చేస్తున్నాడు విక్కీ కౌశల్.
Also Read – Anushka: అనుష్క బర్త్‌డే సర్‌ప్రైజ్ – మలయాళం మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్


