Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభKatrina Kaif: తల్లి కాబోతున్న క్యాట్.. అందుకేనా ఇలా చేస్తుంది!

Katrina Kaif: తల్లి కాబోతున్న క్యాట్.. అందుకేనా ఇలా చేస్తుంది!

- Advertisement -

Katrina Kaif: బాలీవుడ్ క్యాట్ తల్లి కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. నిజానికి కత్రినా ఎప్పుడు ఈ గుడ్ న్యూస్ చెప్తుందా అని ఆమె అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. మీడియా ఎన్నిసార్లు అడిగినా క్యాట్ ఈ విషయంపై ఎలాంటి ఆన్సర్ ఇవ్వకపోయినా.. ఇదిగో సాక్ష్యం అంటూ చాలా రోజులుగా ప్రెగ్నెన్సీపై ప్రచారం జరుగుతూనే ఉంది.

కత్రినా తన గర్భం గురించి ఎలాంటి అనౌన్స్ అయితే చేయకపోగా.. ఇప్పటికే అలియా భట్ తల్లి కావడంతో.. మరో హీరోయిన్ కూడా తల్లి కాబోతుందని బీ టౌన్ లో మరోసారి గట్టి ప్రచారమే జరుగుతుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. క్యాట్ కొన్ని నెలలగా ఎక్కడా బయట కనిపించడం లేదు. ఒకటీ రెండు సార్లు కనిపించినా మీడియా కెమెరాల ముందుకు రావడం లేదు. దానికి తోడు బేబీ బంప్ కవర్ అయ్యే టైపు డ్రెస్సింగ్ తోనే బయట అడుగుపెట్టింది.

ఇక దీనికి తోడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే క్యాట్ చాలాకాలంగా సోషల్ మీడియాకు దూరం ఉంది. ప్రస్తుతం కత్రినా కొత్త సినిమాలు కూడా సైన్ చేయలేదు. రాబోయే రెండు సినిమాలు మేరీ క్రిస్మస్, పఠాన్ సినిమాలు షూటింగ్ కంప్లీట్ కాగా మరో ఏడాది పాటు ఎలాంటి డేట్స్ ఇచ్చేలా లేదని ఇండస్ట్రీ టాక్. పైగా ఓ గైనకాలజిస్ట్ కత్రినా ఇంటికి రెగ్యులర్ చెకప్ కోసం వచ్చి వెళ్తున్నారని క్లోజ్ సర్కిల్స్ మాట. దీంతో ఎప్పుడైనా ఏ క్షణమైనా క్యాట్ నుండి గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News