Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. తొందరలోనే కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ జోడీ అభిమానులకు గుడ్‌న్యూస్ వినిపించబోతున్నట్లు సమాచారం. కత్రినాకైఫ్ మీడియాకు కనిపించి చాలా నెలలు అవుతోంది. సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. గత ఏడాది జనవరిలో రిలీజైన మెర్రీ క్రిస్మస్ తర్వాత కత్రినా కైఫ్ సినిమాలు చేయలేదు. స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ప్రెగ్నెన్సీ కారణంగానే వాటిని రిజెక్ట్ చేసినట్లు తెలిసింది. మీడియా కంట కనిపించకపోవడానికి కూడా కారణం అదేనట.
త్వరలో గుడ్ న్యూస్…
ప్రెగ్నెన్సీ గురించి ఇప్పటివరకు కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ వారు తల్లిదండ్రులు కాబోతున్న వార్త మాత్రం నిజమని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో నెలలో ఈ జంట గుడ్‌న్యూస్ చెప్పడం ఖాయమని అంటున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో కత్రినాకైఫ్ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు చెబుతున్నారు.
Also Read – Bigg Boss New Promo: మొహానికి పెయింట్ పూసి.. హీటెక్కించేలా నామినేషన్స్..!
సోషల్ మీడియాకు దూరం…
సినిమాలకు మాత్రమే కాదు.. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది కత్రినాకైఫ్. ఈ ఏడాది మే తర్వాత తన ఫొటోలతో పాటు భర్తతో కలిసి దిగిన పర్సనల్ ఫొటోలను ఒక్కటి కూడా షేర్ చేయలేదు. తన ప్రెగ్నెన్సీ గురించి బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది కత్రినాకైఫ్.
2021లో పెళ్లి…
2021లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లిచేసుకుంది కత్రినాకైఫ్. రాజస్థాన్‌లో వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించింది కత్రినాకైఫ్. ఫ్యామిలీకే ఎక్కువగా టైమ్ కేటాయిస్తూ వచ్చింది. పెళ్లికి ముందు రెండేళ్ల పాటు విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉంది కత్రినాకైఫ్.
Also Read – Bigg Boss Day 8 Promo: తిండిమానేసిన గుండు అంకుల్.. కన్నీళ్లు పెట్టుకున్న మనీష్.. కెప్టెన్ మాటవినని కామనర్స్
తెలుగులో రెండు సినిమాలు…
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన కత్రినాకైఫ్ తెలుగులో రెండు సినిమాలు చేసింది. వెంకటేష్ మల్లీశ్వరితోపాటు బాలకృష్ణ గొప్పింటి అల్లుడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. మల్లీశ్వరి హిట్టవ్వగా గొప్పింటి అల్లుడు డిజాస్టర్‌గా నిలిచింది. కత్రినాకైఫ్ సినిమాలకు దూరంగా ఉండగా.. విక్కీ కౌశల్ మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌తో అదరగొడుతున్నాడు. విక్కీ కౌశల్ హీరోగా ఈ ఏడాది రిలీజైన ఛావా మూవీ 800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.


