ఈరోజు ఎపిసోడ్‌లో శౌర్య ఆపరేషన్‌కి బిల్లు ఎవరు కట్టారో తెలియక దీప, కార్తిక్ రిసెప్షన్‌లో అడిగితే కార్తిక్ పేరు చెప్తారు. అది అర్థంకాక వాళ్లిద్దరూ ఆలోచిస్తారు. నా పేరు మీద డబ్బులు ఎవరు కట్టారో అని అనుకుంటారు. దీప మాత్రం కార్తిక్ వాళ్లి పిన్ని కట్టిందని అనుకుంటుంది. తర్వాత శ్రీధర్ స్వప్నకు ఫోన్ చేసి మీ అమ్మ అక్కడికి వచ్చిందా అని వెటకారంగా అడుగుతుంది. లేదు ఇక్కడికి రాలేదు అని చెప్తుంది స్వప్న. అక్కడ హాస్పిటల్‌లో కావేరిని దీప ఆపి డబ్బులు మీరేనా కట్టింది అని అడిగితే ఎవరు కడితే ఏంటి ఆపరేషన్ జరుగుతుంది కదా అంటుంది.
మీ అత్తగారు వాళ్ల పుట్టింటికి వెళ్లి డబ్బులు అడిగినా ఇవ్వలేదు వాళ్లు కార్తిక్ వల్లే అంత సంపాదించారు కానీ ఇప్పుడు కార్తిక్ ఆపదలో ఉన్నా ఆదుకోలేదు. కనీసం నేను అయినా సాయం చేసి నా పాపాన్ని కనుక్కోనివ్వు. కార్తిక్, కాంచనకు శ్రీధర్‌ను దూరం చేసాను అందుకే వాళ్లు ఆ కుటుంబానికి దూరం అయ్యారు అంటుంది. నేను ఇచ్చాను అంటే కార్తిక్ ఈ డబ్బులు తీసుకోడు ఇవి వాళ్ల నాన్న ఇచ్చాడు అనుకుంటాడు కానీ ఇవి వాళ్ల నాన్న ఇచ్చినవి కాదు అంటుంది. నేను వాళ్ల జీవితంలోకి రాకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు అని కావేరి బాధపడుతుంది. దీప చేసిన సాయానికి ఇది చేసాను అనుకో కార్తిక్‌కి చెప్పకు అని వెళ్లిపోతుంది.
మరోవైపు జ్యోత్స్న దీపకు కూతురు కంటే మొగుడు ఎక్కువయిపోయాడా అని కావాలని మళ్లీ దీపకి ఫోన్ చేసి రెచ్చగొడుతుంది. అప్పుడు దీప కంగారు పడకు నా కూతురికి ఆపరేషన్ జరుగుతుంది అని చెప్తే జ్యోత్స్న షాక్ అవతుంది. జ్యోత్స్న శౌర్యకు ఆపరేషన్ జరుగుతుందని చెప్తే అదంతా విని ఇంట్లో వాళ్లు అడుగుతారు. శౌర్యకు ఏమ జరగలేదు అన్నావు మరి ఇప్పుడు ఆపరేషన్ ఏంటి అని శివన్నారయణ అడుగుతాడు. జ్యోత్స్న ఏవో మాటలు మార్చేసి నాకు తెలియదు ఇందాకే తెలిసింది. అందుకే సాయం చేద్దాం అని ఫోన్ చేసాను అప్పుడే ఆపరేషన్ జరుగుతుందని చెప్పింది దీప అంటుంది. మంచి వాళ్లకి మంచే జరుగుతుంది అందుకే ఆపరేషన్‌కు డబ్బులు వచ్చి ఉంటాయి అంటారు. వాళ్లకి డబ్బులు ఎలా వచ్చాయని జ్యోత్స్న ఆలోచిస్తూ పారిజాతంతో మాట్లాడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.