Paradise Movie: దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ది పారడైజ్. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం.
సెకండ్ హీరోయిన్‌గా…
ది పారడైజ్‌లో మెయిన్ లీడ్‌గా కింగ్డమ్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే కన్ఫామ్ అయ్యింది. సెకండ్ హీరోయిన్‌గా కయదు లోహర్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ ఏడాది రిలీజైన తమిళ మూవీ డ్రాగన్‌తో కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నది కయదు లోహర్. యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ టాలీవుడ్‌లో మంచి వసూళ్లను రాబట్టింది. డ్రాగన్ సక్సెస్‌తో తెలుగు, తమిళ వర్గాల దృష్టిలో పడిన ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్లే వస్తున్నాయి.
విశ్వక్ సేన్ ఫంకీ…
ప్రస్తుతం విశ్వక్‌సేన్ ఫంకీలో హీరోయిన్‌గా నటిస్తోంది కయదు లోహర్. తాజాగా నాని పారడైజ్‌లో ఛాన్స్ దక్కించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పారడైజ్ మూవీలో డీ గ్లామర్ రోల్‌లో కయదు లోహర్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
శ్రీవిష్ణు మూవీతో…
మూడేళ్ల క్రితం రిలీజైన శ్రీవిష్ణు అల్లూరి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కయదు లోహర్. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఫెయిల్యూర్ కావడంతో కయదుకు మరో అవకాశం రాలేదు. డ్రాగన్‌తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన కయదు లోహర్ ప్రస్తుతం టాలీవుడ్‌పై గట్టి ఫోకస్ పెడుతోంది.
తమిళంలో మూడు సినిమాలు…
తెలుగులోనే కాకుండా తమిళంలో బిజీగా ఉంది. శింబు, అథర్వమురళి సినిమాలతో పాటు జీవీ ప్రకాష్‌తో ఇమ్మోర్టల్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈడీ ఆరోపణలు…
కయదు లోహర్‌పై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలు కోలీవుడ్ నాట హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడులోని మద్యం స్కామ్‌తో సంబంధం ఉన్న కొందరు బడా బాబులు నిర్వహించిన పార్టీలకు కయదు లోహర్ అటెండ్ అయినట్లు, ఈ పార్టీల కోసం ఒక్కో నైట్‌కు కయదు లోహర్ 35 లక్షల వరకు వసూలు చేసినట్లు పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తలపై కయదు లోహర్ మాత్రం రియాక్ట్ కాలేదు.
Also Read- Rashmika Mandanna: మారువేషంలో కింగ్డమ్ సినిమా చూసిన రష్మిక – సీక్రెట్ బయటపెట్టిన నాగవంశీ
కాగా నాని పారడైజ్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ది పారడైజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


