యువ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన ‘క'(KA Movie) మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో కిరణ్ తర్వాతి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తన 10వ చిత్రంగా ‘దిల్ రూబా'(Dilruba)అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలవ్వగా.. తాజాగా KCPD అంటూ సాగే నాలుగో పాటను విడుదల చేశారు. ఈ మూవీలో కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీగా డానియేల్ విశ్వాస్, ఎడిటర్‌గా ప్రవీణ్.కేఎల్, ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ పని చేస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.