Saturday, October 19, 2024
Homeచిత్ర ప్రభKCR MOVIE TRAILER: ఆకట్టుకుంటున్న 'కేసీఆర్' మూవీ ట్రైలర్

KCR MOVIE TRAILER: ఆకట్టుకుంటున్న ‘కేసీఆర్’ మూవీ ట్రైలర్

KCR MOVIE TRAILER| ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో వచ్చిన జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హైపర్ ఆది, ధనరాజ్, గెటప్ శీను, సుడిగాలి సుధీర్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, అప్పారావు, ఆటో రాంప్రసాద్ తదితర నటులు తమ నటనతో ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాందించుకున్నారు. వీరిలో కొంతమంది హీరోలుగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకి తాజాగా రాకిండ్ రాకేష్ కూడా చేరాడు. ఇప్పటికే బుల్లితెరపై తన నటనతో సత్తా చాటిన ఈ క మెడియన్.. ఇప్పుడు వెండితెర మీద హీరోగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకే అతడే నిర్మించడం విశేషం. https://www.youtube.com/watch?v=w-9S-NBVXwE

- Advertisement -

తెలంగాణ ప్రాంత నేపథ్యంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాకు “కేశవ చంద్ర రమావత్”(KCR) పేరు అనే పెట్టారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేరుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంవడటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై హైప్ తీసుకొచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ అన్ని రకాల ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటోంది. పల్లెటూరు నేపథ్యంలో సాగే కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.

చిన్న పిల్లల డైలాగ్‌లతో మొదలైన ట్రైలర్ అసాంతం ఆకట్టుకుంది. ‘అవును బావ నీకు మొన్న నెమలీక ఇచ్చిన అది పిల్లల పెట్టిందా..? అని చిన్నప్పటి హీరోయిన్ ప్రశ్నిస్తే.. పెట్టలేదే.. ఈరోజు చూసిన మళ్లీ చూసి చెబుతాననే’ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో జబర్దస్త్ నటులు ధనరాజ్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, రచన సహా నిర్మాణం రాకింగ్ రాకేష్ అందించగా.. గరుడవేగ అంజి దర్శకత్వం, సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని విభూది ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News